Rajya Sabha: ఏడుగురు కేంద్రమంత్రులను రాజ్యసభకు నో ఎంట్రీ.. కారణం అదేనా..
ABN , Publish Date - Feb 15 , 2024 | 02:09 PM
త్వరలో రాజ్యసభ పదవీకాలం ముగియనున్న ఏడుగురు కేంద్ర మంత్రులను అధికార బీజేపీ తిరిగి నామినేట్ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వారిని లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దించవచ్చనే ఊహాగానాలు ప్రస్తుతం రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
త్వరలో రాజ్యసభ పదవీకాలం ముగియనున్న ఏడుగురు కేంద్ర మంత్రులను అధికార బీజేపీ తిరిగి నామినేట్ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వారిని లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దించవచ్చనే ఊహాగానాలు ప్రస్తుతం రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి. నామినేట్ చేయని వారిలో ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ (గుజరాత్), విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (మధ్యప్రదేశ్), ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (కర్ణాటక), పర్యావరణశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ (రాజస్థాన్), మత్స్యశాఖ మంత్రి పర్షోత్తమ్ రూపాలా (గుజరాత్), సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి నారాయణ్ రాణే ఉన్నారు.
మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన సొంత రాష్ట్రం ఒడిశాలోని సంబల్‌పూర్ లేదా ధేక్నాల్ నుంచి, భూపేందర్ యాదవ్ రాజస్థాన్‌లోని అల్వార్ లేదా మహేంద్రగఢ్ నుంచి, రాజీవ్ చంద్రశేఖర్ బెంగళూరులోని నాలుగు స్థానాల్లో ఒక దాని నుంచి, మాండవీయ గుజరాత్‌లోని భావ్‌నగర్ లేదా సూరత్ నుంచి, రూపాలా రాజ్‌కోట్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం కేబినెట్ లో రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (ఒడిశా), ఎల్. మురుగన్ (మధ్యప్రదేశ్)లు మాత్రమే ఉన్నారు.
మొత్తానికి 28 మంది రాజ్యసభ ఎంపీలలో కేవలం నలుగురికి మాత్రమే బీజేపీ మరోసారి అవకాశం ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఖాళీ అయ్యే 56 స్థానాలకు 28 మంది అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. కొత్త వారికే పార్టీ అధిక ప్రాధాన్యత ఇవ్వడం విశేషం.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.