Home » Parliament
పాతవారిపై నమ్మకం.. కొత్త మిత్రులకు ప్రాధాన్యం.. మాజీ సీఎంలందరికీ చోటు..! ఇదీ మోదీ మూడో విడత క్యాబినెట్ స్వరూపం. మంత్రులుగా ప్రమాణ చేసినవారికి సోమవారం శాఖల కేటాయింపు పూర్తయింది. కీలకమైన వాటిని ఎన్డీఏ పెద్దన్న బీజేపీ తనవారికే ఇచ్చింది. ప్రధాని మోదీ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో శక్తిమంతమైన అమిత్ షా (హోం)తో పాటు కీలక నేతలు రాజ్‌నాథ్‌సింగ్ (రక్షణ), నిర్మలా సీతారామన్ (ఆర్థికం), జైశంకర్ (విదేశాంగం), గడ్కరీ (రహదారులు)ని అవే శాఖల్లో కొనసాగించారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్.. పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఎన్నికల్లో విపక్ష పార్టీ నేషనల్ ర్యాలీ విజయం సాధిస్తుందన్న అంచనాల నేపథ్యంలో ఆదివారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
కీలకమైన ‘లోక్‌సభలో ప్రతిపక్ష నేత’ స్థానం పదేళ్ల తర్వాత భర్తీ కానుంది. గత రెండుసార్లు కాంగ్రెస్ సహా మరే పార్టీ కనీస సంఖ్యలో సీట్లు సాధించకపోవడంతో ఈ పదవి ఖాళీగా ఉంది. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ 100 స్థానాల్లో నెగ్గడంతో అర్హత సాధించింది. లోక్‌సభ మొత్తం సభ్యుల సంఖ్య 543 కాగా.. ఇందులో పదిశాతం (54) సీట్లు గెలిచిన పార్టీకి ప్రతిపక్ష నేత పదవిని పొందే అవకాశం ఉంటుంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ 44 సీట్లనే సాధించింది. 2019లో 52 స్థానాలతో సరిపెట్టుకుంది.
బీజేపీలో సామాన్య కార్యకర్త స్థాయిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన భూపతిరాజు శ్రీనివాస వర్మ నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించడమే అనూహ్యం. అంతే అనూహ్యంగా ఆయనకు కేంద్రమంత్రిగా కూడా అవకాశం దక్కింది. 1967 ఆగస్టు 4న జన్మించిన ఆయనకు.. రొయ్య సాగు, వాణిజ్యంలో 20 ఏళ్లు, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉంది. 1991 నుంచి 95 వరకు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా, 1995 నుంచి 97 వరకు పార్టీ భీమవరం పట్టణ అధ్యక్షుడిగా పనిచేశారు.
రాష్ట్రపతి భవన్ ఆవరణలో ఆదివారం సాయంత్రం వేలాదిమంది ఆహుతులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు, పొరుగు దేశాల అధినేతల సమక్షంలో 73 ఏళ్ల నరేంద్రమోదీ భారతదేశ ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి ప్రమాణం చేశారు. తద్వారా దేశ చరిత్రలో ఇప్పటి వరకూ మాజీ ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూకు మాత్రమే సాధ్యమైన రికార్డును సమం చేశారు.
ఎన్నికల్లో కనీస మెజారిటీ సాధించడంలో విఫలమై.. మిత్రపక్షాల మద్దతుతో ఎన్డీఏ అధికారం చేపడుతున్న వేళ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని ప్రభుత్వాలు ఒక్కరోజే ఉంటాయని.. మోదీ సర్కారు పదిహేను రోజుల్లో కూలిపోవచ్చేమో? అని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అక్రమంగా అధికారంలోకి వచ్చిందని, వారికి శుభాకాంక్షలు చెప్పలేమని వ్యాఖ్యానించారు.
నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన ముగ్గురు అరెస్టు అయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. ఢీవీ ప్రాజెక్ట్స్ అనే సంస్థ పార్లమెంట్ భవన సముదాయంలోని ఎంపీల లాంజ్ నిర్మాణ పనులను నిర్వహిస్తోంది. ఈ సంస్థ తరఫున కార్మికులుగా వచ్చిన ఖాసిమ్, మోనిస్, సోయబ్ నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించేందుకు యత్నించి ఫ్లాప్ గేట్ వద్ద జరిగిన తనిఖీల్లో పట్టుబడ్డారు.
8వ లోక్‌సభ తొలి సమావేశాలు జూన్ 15 నుంచి 22వ తేదీ వరకు జరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకారాలతో ఈ నెల మూడో వారంలో సమావేశాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నాయి. ప్రమాణ స్వీకారాలు రెండ్రోజుల పాటు జరిగే అవకాశం ఉందని, అనంతరం స్పీకర్ ఎన్నిక ఉంటుందని తెలిపాయి.
ఎన్డీఏ(NDA) పక్షనేతగా ప్రధాని మోదీ పేరును(PM Modi) రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్, మిగతా ఎన్డీఏ పక్ష సభ్యులు మోదీని బలపరిచారు.
ఇవాళ పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఎన్డీఏ సమావేశం. ఉదయం ఒక్కసారిగా కలకలం రేగింది. కొందరు వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు విఫల యత్నం చేశారు. వారి ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకున్నారు. ముగ్గురు వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డును తయారు చేసి గేట్ నంబర్ 3 ద్వారా పార్లమెంట్‌లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు.