Parliament Adjourned: పార్లమెంటు నిరవధిక వాయిదా
ABN , Publish Date - Apr 05 , 2025 | 04:11 AM
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగియడంతో శుక్రవారం ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడాయి. 16 బిల్లులకు ఆమోదం లభించిన ఈ సమావేశాల్లో వక్ఫ్ బిల్లుపై వివాదం నెలకొన్నది

బడ్జెట్ సమావేశాల్లో 16 బిల్లులకు ఆమోదం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. శుక్రవారం ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభమైన కాసేపటికే నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. వక్ఫ్ బిల్లు అంశంలో ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ చేసిన విమర్శలపై ఎన్డీయే సభ్యులు నిరసన తెలిపారు. 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైన తర్వాత ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. సభ్యుల ఆందోళనల నడుమ సభను స్పీకర్ వాయిదా వేశారు. కాసేపటికే రాజ్యసభను కూడా చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ నిరవధికంగా వాయిదా వేశారు. జనవరి 31వ తేదీ నుంచి శుక్రవారం వరకు బడ్జెట్ సమావేశాలు జరిగాయి. తొలి విడత సమావేశాల తర్వాత మధ్యలో ఫిబ్రవరి 14 నుంచి మార్చి 9వ తేదీ వరకు విరామం ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల్లో లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ 100 శాతం కంటే ఎక్కువగా పనిచేయడం (ఉత్పాదకత) విశేషం. వక్ఫ్ (సవరణ) బిల్లుతో పాటు మొత్తం 16 బిల్లులకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. గురువారం (ఏప్రిల్ 3) ఉదయం 11 గంటల నుంచి శుక్రవారం వేకువజాము వరకు విరామం లేకుండా 17:02 గంటల పాటు రాజ్యసభ సమావేశాలు జరిగాయి. రాజ్యసభ చరిత్రలోనే ఇంత సుదీర్ఘ సమయం సభ నడపడం ఇదే తొలిసారి. వక్ఫ్ బిల్లుతో పాటు మణిపూర్ అంశంపై చర్చించారు.
ఇవి కూడా చదవండి..
Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్
NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి
PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..
For National News And Telugu News