Share News

Lok Sabha MPs Record: ఒకే రోజున 202 మంది ఎంపీల ప్రసంగం

ABN , Publish Date - Apr 04 , 2025 | 03:50 AM

లోక్‌సభలో గురువారం రికార్డు నమోదైంది, 202 మంది ఎంపీలు జీరో అవర్లో ప్రసంగించారు. స్పీకర్‌ ఓం బిర్లా అదనంగా సమయం ఇవ్వడంతో ఎక్కువ మంది సభ్యులు పాల్గొన్నారు

Lok Sabha MPs Record: ఒకే రోజున 202 మంది ఎంపీల ప్రసంగం

  • లోక్‌సభలో రికార్డు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3: లోక్‌సభ గురువారం రికార్డు సృష్టించింది. శూన్య గంట (జీరో అవర్‌) సమయంలో ఏకంగా 202 మంది ఎంపీలు ప్రసంగించారు. జీరో అవర్‌లో ఎంపీలు ప్రజా ప్రాధాన్యం ఉన్న సమస్యలను ప్రస్తావించి ప్రసంగిస్తారు. సాధారణంగా గంట సమయాన్ని దీనికి కేటాయిస్తారు. అయితే స్పీకర్‌ ఓం బిర్లా అయిదు గంటలకు మించి సమయం ఇవ్వడంతో ఎక్కువ మంది సభ్యులు పాల్గొనడానికి అవకాశం కలిగింది. 2019 జూలై 18న ఇదే విధంగా సమయం పెంచడంతో 161 మంది సభ్యులు పాల్గొనగలిగారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం ముగియనున్నాయి. కాగా, మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఇద్దరు కేథలిక్‌ క్రైస్తవ ప్రీస్ట్‌లపై దాడికి నిరసనగా లోక్‌సభ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్‌ చేశాయి. తొలుత సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ దీనిపై చర్చ జరగాలని పట్టుపట్టారు. ఇందుకు స్పీకర్‌ ఓం బిర్లా అనుమతించకపోవడంతో నినాదాలు చేస్తూ వాకౌట్‌ చేశారు. అనంతరం పార్లమెంటు ఆవరణలో నిరసన తెలిపారు.


ఇవి కూడా చదవండి

Supreme Court Orders: హెచ్‌సీయూ భూములపై తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌కు సుప్రీం ఆదేశాలు

Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో

Read Latest National News And Telugu News

Updated Date - Apr 04 , 2025 | 03:50 AM