Home » Pinnelli Ramakrishna Reddy
పల్నాడు జిల్లా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదైంది. తెలుగు యువత పల్నాడు జిల్లా కార్యదర్శి కొమర శివపై పిన్నెల్లి మాచర్ల కోర్టు వద్ద పిడికిలితో కడుపులో గుద్ది దాడి చేశారని పేర్కొంటూ శివ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు(మే 13న), మరుసటి రోజు జరిగిన దాడులకు సంబంధించిన కేసుల్లో అరెస్టయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన్ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కొత్త రాగం అందుకున్నారు. పోలీసులు పిన్నెల్లిని అదుపులోకి తీసుకోలేదని...
నెల్లూరు సెంట్రల్ జైలుకి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు తరలించారు. మాచర్ల జూనియర్ సివిల్ జడ్జీ ఎదుట పిన్నెల్లిని పోలీసులు ప్రవేశపెట్టారు. ఈవీఎంల ధ్వంసం, ఓటర్లని భయపెట్టిన నాలుగు కేసుల్లో విచారణ కొనసాగుతోంది. రెండు కేసుల్లో బెయిల్ మంజూరు చేశారు. మరో రెండు కేసులకి సంబంధించి 14 రోజులు రిమాండ్ విధించారు.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్టు నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే వారికి శిక్ష తప్పదని, మాచర్ల మాజీ శాసన సభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉదంతమే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించింది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎం పగలగొట్టిన మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ నుంచి ఉపశమనం కల్పించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు తోసిపుచ్చడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎం పగలగొట్టిన మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలింది.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. పిన్నెల్లిపై ఉన్న కేసుల విషయంలో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఇచ్చిన..
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై పోలీసులు రౌడీషీట్ తెరిచారు.
పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అరాచకాలు, అక్రమాలకు పాల్పడి, అల్లకల్లోలం సృష్టించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డిపై మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం రౌడీషీట్ ఓపెన్ చేసినట్టు తెలిసింది.