Home » Pinnelli Ramakrishna Reddy
జిల్లాలో పరిస్థితి క్షణ క్షణం ఉత్కంఠ భరితంగా మారుతోంది. పిన్నెల్లి వ్యవహారంలో ఏం జరుగుతుందోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఈవీఎం ధ్వంసం కేసు సహా పలు కేసుల్లో నిందితుడైన మాచెర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి..
అధికారం పోవడంతో మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుల అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎన్నికల రోజు (మే13) పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ ఈ రోజు (గురువారం)తో ముగియనుంది. దీంతో పిన్నెల్లిని ఏ క్షణమైన పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘనలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దాంతోపాటు మూడు ఘటనల్లో హత్యాయత్నం కేసులు ఉన్నాయి.
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఓట్ల లెక్కింపు సందర్భంగా మంగళవారం మాచర్ల నియోజకవర్గానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు.
పిన్నెల్లి ముందస్తు బెయిల్ రద్దుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ అరవింద్ కుమార్ , జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరగనుంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి బాధితుడైన నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందని, హైకోర్టు ఇచ్చిన అరెస్ట్ మినహాయింపు ఆదేశాలను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో శేషగిరిరావు పిటిషన్ దాఖలు చేశారు.
మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ముందస్తు బెయిల్ రద్దుపై రేపు(సోమవారం) సుప్రీంకోర్టులో(Supreme Court) విచారణ జరుగనున్నది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ చేపట్టునున్నది.
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ టీడీపీ పోలింగ్ ఎజెంట్ నం బూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన రెండు పిటిషన్లు దాఖలు చేశారు
కారంపూడి సీఐ నారాయణస్వామి(CI Narayana Swamy)పై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. నారాయణస్వామిని విధులకు దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. కారంపూడిలో సీఐ నారాయణస్వామి శాంత్రిభద్రతలు కాపాడటంలో విఫలమయ్యారని, తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ ఏపీ హైకోర్టు(AP High Court)ను పిన్నెల్లి ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం సీఐను విధులకు దూరంగా ఉంచాలని సీఈవో ముకేశ్ కుమార్ మీనాను ఆదేశించారు. దీంతో సీఐ నారాయణస్వామిని విధుల నుంచి ఈసీ తప్పించింది.
న్యూఢిల్లీ: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాల్సిందేనని.. పోలీసులకు ఆదేశించాలంటూ బాధితుడు నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందని, హైకోర్టు ఇచ్చిన అరెస్టు మినహాయింపు ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సందర్భంగా తన పైన నమోదైన కేసుల్లో విచారణ అధికారులను మార్చాలని కోరుతూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణకు హైకోర్ట్ అనుమతించింది.