Home » Polavaram
జగన్ మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో డ్రైన్లలో తట్ట మట్టి తీయలేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రిగా బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకి మంత్రి నిమ్మల రామానాయుడు ధన్యవాదాలు తెలిపారు. తనను గెలిపించి మంత్రిని చేసిన 70 వేల నియోజకవర్గ కుటుంబాలకు పాదాభివందనం చేస్తున్నానన్నారు.
గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగిందని కేంద్ర బొగ్గు గనుల మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు.
పోలవరం ప్రాజెక్టుపై ‘రివర్స్’ వద్దన్నా జగన్ పట్టించుకోలేదు. చివరికి... ఒక విధ్వంసానికి కారకుడయ్యారు. జగన్ చేసిన ఈ నిర్వాకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. జగన్ కారణంగా పోలవరానికి జరిగిన నష్టం, విధ్వంసాన్ని వివరించి...
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని జగన్ ప్రశ్నార్థకం చేశారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు విమర్శించారు.
తనకు అర్థం కాలేదు కాబట్టి.. పోలవరం సబ్జెక్ట్ ఇంకెవరికీ అర్థం కాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అంతేకాదు.. ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని తొలిసారిగా చెప్పిన గొప్పతనం కూడా తనదేనని గొప్పగా చెప్పుకొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల పోలవరం ప్రాజెక్ట్ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్పై ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమీక్షా సమావేశంలో ఈ అయిదేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ విధ్వంసంలో అసలు సిసలు వాస్తవాలు వెలుగు చూసినట్లు తెలుస్తుంది.
ఆంధ్రుల జీవనాడి పోలవరం (Polavaram)ను మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) అదోగతి పాలు చేశారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ (MLC Panchumarthy Anuradha) అన్నారు. 20ఏళ్ల క్రితం పోలవరానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసినా ఒక్క అడుగూ ముందుకు పడలేదన్నారు.
రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తూ వచ్చిందని.. కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, అధికారులు కూడబలుక్కుని ప్రాజెక్టులోని కీలకమైన నిర్మాణాలు కూల్చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.
జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) ముఖ్యమంత్రి హోదాలో ప్రజాదనాన్ని దుర్వినియోగం చేశారని ఎంపీ పురందేశ్వరి (MP Purandeshwari) అన్నారు. ప్రజల సొమ్ముతో విశాఖ రుషికొండ (Rushikonda)పై విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారని దుయ్యబట్టారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ప్రమాణ స్వీకారం చేయడం.. బాబు ఆన్ డ్యూటీ అంటూ రంగంలోకి దిగిపోవడం ఇవన్నీ చకచకానే జరిగిపోతున్నాయి..