Budget 2024: బడ్జెట్‌లో ఏపీకి మరికొన్ని ప్రయోజనాలు.. వివరాలివే..
ABN , Publish Date - Jul 23 , 2024 | 05:02 PM
Union Budget 2024: కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా కేటాయింపులు చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలే కాకుండా.. ఇతర ప్రయోజనాలను కూడా ఏపీకి కల్పించారు.
Union Budget 2024: కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా కేటాయింపులు చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలే కాకుండా.. ఇతర ప్రయోజనాలను కూడా ఏపీకి కల్పించారు. అవును, కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి మరికొన్ని అదనపు ప్రయోజనాలు కూడా కలగనున్నాయి. మరి ఆ ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం..
ఏపీకి ఇతర ప్రయోజనాలు..
విదేశీ సంస్థల సాయంతో అమలయ్యే పలు ప్రాజెక్టులు కింద ఏపీకి నిధులు అందించనున్నారు. నేషనల్ డెవలప్‌మెంట్ బ్యాంక్, ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్, న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీ కన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ ద్వారా వివిధ ప్రాజెక్టుల కింద ఏపీకి సాయం అందించనున్నారు. ఆంధ్రప్రదేశ్ మండల్ కనెక్టివిటీ అండ్ రూరల్ కనెక్టివిటీ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అండ్ లైవ్లీహుడ్ ఇంప్రూమెంట్ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్స్ ప్రాజెక్ట్స్, ఆంధ్రప్రదేశ్ రోడ్స్ అండ్ కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్, ఏపీ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చరల్ ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రాజెక్ట్ లకు విదేశీ సంస్థల నుంచి సాయం అందనుంది.
భారీగా పెరిగిన పన్నుల వాటా..
ఇదిలాఉంటే.. కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి వచ్చే వాటాలోనూ భారీగా పెరుగుదల ఉంది. 2024-25 సంవత్సరానికి సంబంధించి కేంద్రం పన్నుల్లో ఏపీ పన్నుల వాటా రూ. 50,474 కోట్లు రానుంది. ఇదే సమయంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి రూ. 620 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. సింగరేణి సంస్థకు రూ. 1,600 కోట్లు కేటాయించింది. ఇక కీలకమైన పథకాల కింద ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని నిధులు అందనున్నాయి.
బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న అంశాలివే..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగంలో ఏపీకి కేటాయింపుల వివరాలను కూడా తెలిపారు. పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా నిర్మించడం, రాష్ట్ర రాజధాని అమరావతికి ఈ ఏడాది రూ. 15 వేల కోట్ల కేటాయించడంతో పాటు.. ఈ సాయాన్ని ప్రతి ఏటా కొనసాగించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు నిధులు మంజూరు చేస్తామన్నారు. విశాఖ-చెన్నై-ఓర్వకల్లు-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌కు నిధులు కేటాయిస్తామన్నారు. పూర్వోదయ పథకం కింద ఏపీకి మరింత సాయం అందిస్తామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటునందిస్తామని ప్రకటించారు.
Also Read: