Home » Police
వానాకాలంపై ఎన్నో ఆశలతో చేలల్లో విత్తనాలు విత్తేందుకు.. ఎరువులు చల్లేందుకు సిద్ధమవుతున్న రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులను అంటగట్టేందుకు కాచుక్కూర్చున్న ముఠాల ఆటకట్టించేందుకు కాంగ్రెస్ సర్కారు సమాయత్తమైంది. వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాల్ని అరికట్టేందుకు వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు, సిబ్బందితో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసింది.
గ్రామాల్లో గొడవలు, ఘర్ష ణలకు పాల్పడ కుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఎస్‌ఐ వీ రేష్ తెలిపారు. మండ లంలోని మధుడి గ్రామం లో గురువారం ఆయన ఎస్సీ కాలనీలో పర్యటించి వారితో మాట్లాడారు. జూన 4న ఎన్నికల కౌంటింగ్ జరు గుతున్న నేపథ్యంలో ఎలాంటి రాజకీయ పార్టీల గొడవలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ఉండాలన్నారు.
గో రక్షణ చేస్తే చంపేస్తామని కొంతమంది తమ కార్యకర్తలను బెదిరిస్తున్నారని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన వారే తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు.
నెల్లూరు, మే 30: సినిమాల ప్రభావమో.. దిమాక్‌కు జరంత ఎక్కువ పని చెప్పారో తెలియదు గానీ.. భారీగా నగదు, బంగారం బిస్కెట్లు తరలించేందుకు పెద్ద ప్లానే వేశారు కొందరు దుండగులు. కానీ.. పోలీసులు ఊరుకుంటేనా? ఛాన్సే లే.. అడ్డంగా దొరకబట్టారు. వారి వద్ద ఉన్న బంగారం, నగదుతో పాటు..
రాచకొండ కమిషనరేట్ పరిధిలో వెలుగు చూసిన శిశు విక్రయాల కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్టు చేసిన పోలీసులు.. ఆ ముఠా గుట్టును రట్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, పుణెలోని ముఠాల ద్వారా సుమారు 60 మంది చిన్నారులను విక్రయించినట్టు పోలీసుల అదుపులో ఉన్న నిందితులు వెల్లడించారు.
అవి 26 జీవాలు! అందులో 24 ఎద్దులు, రెండు ఆవులున్నాయి! అన్నింటినీ ఒకే కంటెయినర్‌లో కుక్కేసి సూర్యాపేట నుంచి తమిళనాడుకు తరలిస్తున్నారు. ఇదొక్కెత్తయితే.. ఈ తరలింపును అడ్డుకున్న పోలీసులు, ఆ కంటెయినర్‌ను తెరవకుండా 13 గంటలపాటు అలాగే ఉంచారు. మండే ఎండకు లోపల గాలి ఆడక.. మేత లేక.. తాగేందుకు నీరూ లేక ఆ మూగజీవాలు తట్టుకోలేకపోయాయి.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్‌రావు కేసులో.. ఆయన ఇంట్లో దొరికిన డైరీ కీలకంగా మారుతున్నట్లు తెలిసింది. మూడ్రోజుల కస్టడీకి నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టు అనుమతించడంతో.. బుధవారం ఉదయం ఏసీపీని చంచల్‌గూడ జైలు నుంచి ఏసీబీ కార్యాలయానికి తరలించారు.
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో బుధవారం డీఎస్పీ బాజీజానసైదా ఆధ్వర్యంలో పోలీసులు పట్టణంలోని దర్గా సర్కిల్‌లో మాక్‌డ్రిల్ ని ర్వహించారు. ఎన్నికల కమిషన ఆదేశాల మేరకు జూన 4న ఓట్ల లెక్కింపు జరుగు తుంది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసు కోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో అనేక సంచలనాత్మక విషయాలు బయటపడుతున్నాయి. విచారణలో ప్రణీతరావు ఇచ్చిన వాంగ్మూలంలో 1200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు. జడ్జీలు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, వాళ్ల కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లు ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు.
కౌంటింగ్ రోజు, ఆ తరువాత ఎలాంటి సమస్యలు తలెత్తినా ఎదుర్కొనేందుకు పోలీసు శాఖ ఆయుధాలను సిద్ధం చేసుకుంది. పోలీస్ పరేడ్ మైదానంలో ఎస్పీ గౌతమిశాలి సోమవారం వాటిని తనిఖీ చేశారు. అల్లరి మూకలను చెదరగొట్టేందుకు వాడే గ్యాస్ గన, యాంటీ రయట్ గన, ప్లాస్టిక్ పెల్లెట్స్, బాలిస్టిక్ క్యాట్రిడ్జిలు ...