Home » Police
తెలుగు రాష్ట్రాల్లో పిల్లలను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు రాచకొండ పోలీసులు. ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విక్రయిస్తున్న ముఠా అరెస్టు సంచలనంగా మారింది. 13మంది చిన్నారులను కాపాడి 11మంది నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ తరుణ్ జోషి వెల్లడించారు.
మండలంలోని చదం గొల్లలదొడ్డి గ్రామంలో సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కార్డెన సెర్చ్ నిర్వహించారు. సోమవారం గ్రామాన్ని సందర్శించి ఇళ్లలో పాకల్లో గడ్డివాముల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
నక్సలైట్లు(Naxalites) ఆదివారం అర్ధరాత్రి మరో దారుణమైన ఉదంతానికి పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో నిర్మాణంలో ఉన్న రెండు బీఎస్‌ఎన్‌ఎల్ టవర్‌లకు నిప్పు పెట్టారు. ఆ తర్వాత నక్సలైట్లు పలు బ్యానర్లు, పోస్టర్లను కూడా అక్కడ వేశారు. అయితే ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుందనే వివరాలను ఇప్పుడు చుద్దాం.
పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ గూండాల అరాచకాలు ఆగడం లేదు. తాజాగా ఓ మహిళపై పాశవికంగా దాడిచేసి గాయపరిచారు. ‘మా అన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కాకుండా టీడీపీకి ఓట్లు వేస్తారా.. మీరు వార్డులో ఎలా ఉంటారో చూస్తా.. మిమ్మల్ని అందరినీ చంపేస్తా.. నా పేరే మసి.. నాతో పెట్టుకుంటే మసై పోతారు..’ అని వైసీపీకి చెందిన రౌడీ ఉప్పుతోళ్ల వెంకటేష్ అలియాస్ మసి శనివారం రాత్రి రెచ్చిపోయాడు.
పట్టణం నడిబొడ్డున రద్దీగా ఉండే ప్రదేశమది. సాయంత్రంపూట పూలు, కూరగాయలకు వచ్చే జనంతో కిక్కిరిసి ఉంటుంది. ఆ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం పోలీసులు భారీగా మోహరించారు. వజ్రా వాహనం, సీఆర్‌పీఎఫ్ స్పెషల్‌పార్టీ సిబ్బందితో గన్నులు ఎక్కిపెట్టి ఉన్నారు. మరో వైపు నిరసనకారులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అసలు అక్కడ ఏంజరుగుతుందో చూసేవారికి అర్థంకాలేదు. అదే సమయంలో మొదట పోలీసు హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
లోక్‌సభ ఎన్నికల వేళ పెద్ద ఎత్తున అక్రమ బంగారం(gold) వెలుగులోకి వచ్చింది. నిన్న ఆరో దశ ఎన్నికల ఓటింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్(West Bengal)లోని ఉత్తర 24 పరగణాస్ జిల్లాలో భారీగా పుత్తడిని అధికారులు పట్టుకున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఎన్నికలు పూర్తవ్వడంతో ఇప్పుడు పూర్తిస్థాయిలో పరిపాలనపై దృష్టి సారించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రభుత్వ శాఖల్లో సుదీర్ఘకాలంగా ఒకేచోట పాతుకుపోయిన వారికి స్థానచలనం కలిగించనున్నారా? ఆ స్థానాల్లో సమర్థులైన అధికారులను నియమిస్తారా? ఇందుకోసం పాలనాయంత్రాంగంలో తహసీల్దార్ మొదలు సీనియర్ ఐఏఎస్ అధికారి దాకా అన్ని స్థాయుల్లో భారీ బదిలీలకు కసరత్తు జరుగుతోందా?
ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేసి జైలుకు తరలించడం సీసీఎ్‌సలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. రూ.1500 కోట్ల సాహితీ ఇన్‌ఫ్రా మోసం కేసులో కీలక విచారణాధికారిగా ఉన్న ఉమామహేశ్వరరావుపై అవినీతి ఆరోపణలు రావడం, ఆయనను అక్రమాస్తుల కేసులో ఏసీబీ అఽధికారులు అరెస్టు చేయడం తెలిసిందే.
తెలంగాణ పోలీస్ శాఖలో పనిచేస్తున్న సుమారు రెండు వేల మంది హోంగార్డుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రస్తుత ఏపీకి చెందిన పలు జిల్లాల నుంచి హోంగార్డులు విధుల్లో చేరారు. రాష్ట్ర విభజన సమయంలో సుమారు 2 వేల మంది ఏపీ స్థానికత కలిగిన హోంగార్డులు తెలంగాణలోనే ఉండిపోయారు.
సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌పై యువతలో ఉన్న మోజును కొన్ని కంపెనీలు క్యాష్ చేసుకొని భారీ మోసాలకు పాల్పడుతున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం ఆశ చూపించి వారి దగ్గర సాఫ్ట్ వేర్ జాబ్ అంటూ డబ్బులు తీసుకొని విద్యార్థులు మంచిగా నటిస్తూ మెయింటైన్ చేస్తున్నారు. వారి దగ్గర నుంచి లక్షల రూపాయల వసూళ్లకు పాల్పడి భారీ మోసాలకు పాల్పడుతున్నాయి.