Home » Ponnam Prabhakar
ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) శవ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సంచలన ఆరోపణలు చేశారు. విభజన హామీలను బీజేపీ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటును మోదీ అవహేళన చేశారని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం అన్నింటి మీద జీఎస్టీ వసూలు చేస్తుందన్నారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ సంస్కృతి గురించి తెలియదని మండిపడ్డారు.
Telangana: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. ముఖ్యంగా కరీంగనర్ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్‌కు, ఎంపీ బండి సంజయ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి. ఎన్నికల్ల ప్రచారంలో భాగంగా ఇరువురి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. నువ్వెంత అంటే.. నువ్వెంత అన్న రేంజ్లో ఒరిపై ఒకరు దమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలో ఎంపీ బండి సంజయ్‌పై మంత్రి పొన్నం సంచలన ఆరోపణలు చేశారు. సొంత పార్టీ నేతల పట్ల కూడా బండి సంజయ్ వ్యవహార శైలి సరిగా లేదంటూ వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బండి సంజయ్‌కు ఈటెల రాజేందర్‌కు విభేదాలున్నాయని అన్నారు.
కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్తి నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి దూరంగా ఉండనున్నారు. నేడు కాంగ్రెస్ తరుఫున వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. కరీంనగర్ సీటుపై అధిష్టానం ఎటూ తేల్చలేదు. రాజేందర్ రావే అభ్యర్థి అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు
లోక్‌సభ ఎన్నికల్లో అవినీతి బీఆర్ఎస్ నుంచి పోటీ చేయలేమంటూ ఆ పార్టీ అభ్యర్థులే పారిపోతున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
Telangana: కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కార్యకర్తలందరూ కష్టపడి పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం (ఎస్)లోని శుభం గార్డెన్లో హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయని, వచ్చే ఆగష్టు 15లోపు రైతులకు రెండు లక్షల రూపాయల...
కరీంనగర్: విపక్షాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బోగస్ గాళ్ళు చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవద్దన్నారు. ఐదు నెలల కాంగ్రెస్ సర్కార్‌కు శాపనార్ధాలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముడు మీకు మాత్రమే దేవుడా?.. రాముని పేరు లేకుండా ఓట్లు అడగలేరా అని ప్రశ్నించారు.
బీజేపీకి ఐదు వందల కోట్లు ఇచ్చినందుకే అరెస్టయిన అరబిందో డైరెక్టర్ పెనక శరత్ చంద్రారెడ్డికి బెయిల్ మంజూరైందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాండ్ల విషయంలో బీజేపీ సమర్ధించుకుంటున్న తీరు గర్హనీయమన్నారు. అవినీతి డబ్బు పార్టీలకు వస్తే అది నీతివంతంగా మారిపోతుందా? అని ప్రశ్నించారు.
కరీంనగర్: తెలంగాణకు ఇచ్చిన హామీలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెరవేర్చలేదని, విభజన హామీలు ఎందుకు అమలు చెయ్యలేదని మంత్రి పొన్నం ప్రబాకర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు.
కరీంనగర్: పదేళ్ల విభజన హామీల అమలు నిర్లక్ష్యంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం దీక్ష చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో పొన్నం దీక్ష చేయనున్నారు.
Telangana: మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్షకు పూనుకున్నారు. ఏప్రిల్ 14న దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. బీజేపీ, బీఆర్ఎస్ వైఫల్యాలపై పొన్నం దీక్ష చేయాలని నిర్ణయించారు. కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో దీక్షకు దిగనున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూం ఇచ్చిన వాళ్ళనే బీఆర్ఎస్ ఓట్లు అడగాలని అన్నారు. ‘‘మాకు ఒక్క వేలు చూపిస్తే.. మేం నాలుగు వేళ్ళు చూపెడుతాం’’ అని అన్నారు.