Share News

Ponnam Prabhakar: ఈనెల 14న మంత్రి పొన్నం దీక్ష.. ఎందుకోసమంటే?

ABN , Publish Date - Apr 12 , 2024 | 03:06 PM

Telangana: మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్షకు పూనుకున్నారు. ఏప్రిల్ 14న దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ వైఫల్యాలపై పొన్నం దీక్ష చేయాలని నిర్ణయించారు. కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో దీక్షకు దిగనున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూం ఇచ్చిన వాళ్ళనే బీఆర్ఎస్ ఓట్లు అడగాలని అన్నారు. ‘‘మాకు ఒక్క వేలు చూపిస్తే.. మేం నాలుగు వేళ్ళు చూపెడుతాం’’ అని అన్నారు.

Ponnam Prabhakar: ఈనెల 14న మంత్రి పొన్నం దీక్ష.. ఎందుకోసమంటే?
Minister Ponnam Prabhakar

హైదరాబాద్, ఏప్రిల్ 12: మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) దీక్షకు పూనుకున్నారు. ఏప్రిల్ 14న దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. బీజేపీ (BJP), బీఆర్‌ఎస్ (BRS) వైఫల్యాలపై పొన్నం దీక్ష చేయాలని నిర్ణయించారు. కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో దీక్షకు దిగనున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూం ఇచ్చిన వాళ్ళనే బీఆర్ఎస్ ఓట్లు అడగాలని అన్నారు. ‘‘మాకు ఒక్క వేలు చూపిస్తే.. మేం నాలుగు వేళ్ళు చూపెడుతాం’’ అని అన్నారు. పదేండ్లు మంత్రిగా ఉన్న హరీష్ రావు (BRS MLA Harish Rao) బుద్ధి ఉండే మాట్లాడుతున్నాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడడంపై మోదీ అవహేళన చేశారని.. తెలంగాణ అమరులను ప్రధాని అవమానించారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Delhi Liquor Scam: కవిత దందాలను బయటపెట్టిన సీబీఐ.. వామ్మో ఇలా చేశారా!?


తెలంగాణలో ఓట్లు అడగడానికి మోదీకి ఏం హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. ‘‘ తెలంగాణకు బీజేపీ చేసిందేంటి? కొత్త రాష్ట్రానికి పదేండ్లలో బీజేపీ ఇచ్చిందేంటి? దేశాన్ని అదాని, అంబానీకి అమ్మడం తప్పా మోదీ ఏం చేశారు? బీజేపీని వ్యతిరేకిస్తే ఈడీ, సీబీఐలతో ఇబ్బంది పెడుతున్నారు. రాముడి ఫోటో పక్కన మోదీ ఫోటో ఎలా పెడుతారు. అభివృద్ధి ఏం చేశారని అడిగితే అది పక్కన పెట్టి గాలి కబుర్లు, సొల్లు కబుర్లు చెబుతున్నారు’’ అంటూ విరుచుకుపడ్డారు. రాముడిని రాజకీయాల కోసం వాడుకోవడం తప్పన్నారు. సికింద్రాబాద్‌కు తెలంగాణ బీజేపీ అధినేత కిషన్ రెడ్డి ఏం చేశారని నిలదీశారు. చేనేత కార్మికులకు బీజేపీ అన్యాయం చేసిందని అన్నారు.


ప్రకృతి వైపరీత్యాలకు నార్త్ ఇండియాలో ఎలా ఆదుకుంటున్నారో సౌత్ ఇండియాలో కూడా అలాగే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘మిషన్ కాకతీయ నీళ్ళు మొత్తం ఎటు పోయాయి? మేం తాగినమా, మీరు తాగారా?’’ అంటూ ప్రశ్నలు సంధించారు. గుర్తింపు కోసమే కొందరు బీజేపీ నాయకులు కాంగ్రెస్ మంత్రులపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

Big Breaking: నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్‌కు ట్రయల్స్..

KA Paul: ప్రజాశాంతి పార్టీ గుర్తు మారిందండోయ్.. కొత్త గుర్తు ఏంటంటే..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 12 , 2024 | 03:09 PM