Share News

Congress: రైతుల రుణమాఫీ ఎప్పుడో చెప్పిన మంత్రి పొన్నం

ABN , Publish Date - Apr 19 , 2024 | 03:23 PM

Telangana: కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కార్యకర్తలందరూ కష్టపడి పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం (ఎస్)లోని శుభం గార్డెన్‌లో హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయని, వచ్చే ఆగష్టు 15లోపు రైతులకు రెండు లక్షల రూపాయల...

Congress: రైతుల రుణమాఫీ ఎప్పుడో చెప్పిన మంత్రి పొన్నం
Minister Ponnam Prabhakar About Farmer loan waiver

కరీంనగర్‌, ఏప్రిల్ 19: కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో(Loksabha Elections) కాంగ్రెస్ పార్టీ (Congress) గెలుపుకు కార్యకర్తలందరూ కష్టపడి పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం (ఎస్)లోని శుభం గార్డెన్‌లో హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయని, వచ్చే ఆగష్టు 15లోపు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని స్పష్టం చేశారు. వచ్చే వానాకాలం పంటకి 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు.

TS Politics: బీఆర్‌ఎస్‌‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే?


కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ నియోజకవర్గ అభివృద్ధికి ఏమైనా చేశాడా?, ఏదైనా గ్రామంలో తిరిగాడా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థికి వాళ్ళ పార్టీ నేతలకు కూడా చెయ్ కలుపరని వ్యాఖ్యలు చేశారు. తాను ఎంపీగా అయిదు సంవత్సరాలు ఏం చేశానో, బండి సంజయ్, వినోద్ కుమార్ ఎంపీలుగా ఏం చేశారో చర్చిద్దాం అని సవాల్ విసిరారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి ఎంపిక పార్టీ అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని 304 బూతులలో పార్టీ అభ్యర్థికి మెజారిటీ వచ్చేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి...

Balakrishna: టీడీపీ - జనసేన - బీజేపీ కూటమిని తట్టుకునే శక్తి ఎవరికీ లేదు

Crime News: కాలేజీలో దారుణం.. ప్రేమించలేదనే అక్కసుతో అందరూ చూస్తుండగా ప్రియురాలిపై..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 19 , 2024 | 03:23 PM