Home » Prime Minister
ప్రస్తుతం డీప్‌ఫేక్(deepfake) వీడియోల ట్రెండ్ కొనసాగుతుంది. ప్రముఖ నటీనటుల నుంచి క్రీడాకారుల వరకు ఇప్పటికే అనేక మందిపై ఈ వీడియోలు వచ్చాయి. కానీ తాజాగా ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలోని(giorgia Meloni)పై కూడా ఈ డీప్‌ఫేక్ వీడియోలు(deepfake videos) రూపొందించి ఓ పోర్న్ వైబ్సైట్లో అప్లోడ్ చేశారు.
కేరళలోని పాలక్కడ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( PM Modi ) బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కేరళలో కమలం వికసిస్తుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ముగ్గురు నేతలు ఒకే వేదికపైకి రానున్నారు. వైసీపీ అరాచక పాలనను అంతం చేయడమే లక్ష్యంగా రానున్న ఎన్నికల్లో టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) కూటమిగా పోటీచేస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం కంకణబద్ధులయ్యేందుకు మూడు పార్టీలు ఏకమయ్యాయి. పొత్తు కుదిరిన తర్వాత మూడు పార్టీల తొలి ఉమ్మడి సభకు వేదికైంది పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట.
రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్న నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ కు భారీ ఉమశమనం లభించింది. పార్లమెంటులో ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షలో ఆయన గెలిచారు. దహల్‌కు అనుకూలంగా 157 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 110 ఓట్లు పోలయ్యాయి. ఒకరు గైర్హాజరయ్యారు.
2024 లోక్‌సభ ఎన్నికలకు ముహుర్తం దగ్గర పడుతుండడంతో ప్రధాని నరేంద్ర మోదీ దూకుడు పెంచారు. రానున్న ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా మోదీ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో వేల కోట్ల రూపాయలతో పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.
పాకిస్థాన్ 24వ ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్ సోమవారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. ఐవాన్-ఐ-సదర్‌లో జరిగిన కార్యక్రమంలో పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. నవాజ్ షరీఫ్, మరియం నవాజ్, ఇతర పీఎంఎల్-ఎన్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపాల్ రాజకీయాల్లో సంక్షోభం కొనసాగుతుంది. ఈ క్రమంలో అక్కడి ప్రధాని ప్రచండ మాజీ ప్రధాని ఓలీ పార్టీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
కెనడా మాజీ ప్రధాని బ్రియాన్ ముల్రోనీ (84)(Brian Mulroney) కన్నుమూశారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. నివేదికల ప్రకారం బ్రియాన్ ముల్రోనీ గత సంవత్సరం ప్రారంభంలో ప్రోస్టేట్ క్యాన్సర్‌తో చికిత్స పొందారు.
పాకిస్థాన్‌లో కొత్త సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP), పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) అనేక రోజుల చర్చల తర్వాత ఎట్టకేలకు ఒప్పందం కుదుర్చుకున్నాయని పార్టీ నేతలు మంగళవారం రాత్రి ప్రకటించారు. ఈ క్రమంలో దేశ ప్రధాని, అధ్యక్ష పదవులు కూడా దాదాపు ఖారారయ్యాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రూ.10 లక్షల కోట్లకుపైగా విలువైన 14,000 ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. సోమవారం జరిగే యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 నాల్గో గ్రౌండ్ బ్రేకింగ్ వేడుకలో భాగంగా ప్రధాని ఈ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.