Home » Prime Minister
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోల్ జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే సభకు హాజరుకావడానికి బీజేపీ కార్యకర్తలతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది.
పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా మాజీ సెనెటర్, బలూచిస్తాన్ అవామీ పార్టీ నేత అన్వర్ ఉల్ హక్ కాకర్ సోమవారంనాడు ప్రమాణ స్వీకారం చేశారు. పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 14వ తేదీనే దేశ 8వ ఆపద్ధర్మ ప్రధానిగా కాకర్ ప్రమాణస్వీకారం చేయడం విశేషం.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ఇండియా (I.N.D.I.A) తరపున ప్రధాన మంత్రి పదవికి రేసులో మొదటి అభ్యర్థి పేరు తెరపైకి వచ్చింది. ఈ పదవి పట్ల తమకు ఆసక్తి లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikharjun Kharge) ప్రకటించిన నేపథ్యంలో టీఎంసీ ఓ ముందడుగు వేసింది. గతంలో జేడీయూ కూడా తమ అధినేతను బరిలో నిలుపుతామని చెప్పింది.
ప్రధాన మంత్రిని దూషిస్తూ మాట్లాడే మాటలు కేవలం అవమానకరం, అగౌరవప్రదం, బాధ్యతారహితం మాత్రమేనని, రాజద్రోహంగా పరిగణించదగినవి కాదని కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) తెలిపింది. బీదర్‌లోని షహీన్ స్కూల్ యాజమాన్యంపై దాఖలైన రాజద్రోహం కేసును రద్దు చేసింది. హైకోర్టు కలబుర్గి ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది.
మాఫియాను మట్టి కరిపిస్తానని చెప్పిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ దిశగా చురుగ్గా చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో మాఫియా కబ్జా చేసిన భూములను జప్తు చేసి, అందమైన ఇళ్లను నిర్మించి, నిరుపేదలకు అప్పగిస్తున్నారు. ఆయన శుక్రవారం 76 ఫ్లాట్ల తాళాలను నిరుపేద లబ్ధిదారులకు అప్పగించారు.
తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రధాని తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. జూలై 8న వరంగల్‌లో ప్రధాని పర్యటించనున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ప్రధాని అధికారిక కార్యక్రమాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని బీజేపీ నిర్ణయించింది. వరంగల్ పర్యటనలో భాగంగా కాజీపేట వ్యాగన్ ఓరలింగ్ సెంటర్‌కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, కవితపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీష్‌రావు స్పందించారు.
న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటులో లోక్‌సభ స్పీకర్ వేదక సమీపంలో రాజదండం కొలువు తీరుతోంది. సహజంగా రాజ్యాధికారం ఒకరి నుంచి మరొకరికి అప్పగించడానికి ప్రతీకగా రాజదండం మార్పిడి జరుగుతుంటుంది. ఒకప్పటి రాజుల్లేరు, రాజరికాలు అంతకంటే లేవు. అధికార మార్పిడి జరుగుతున్న సందర్భమూ కాదు. ఇప్పుడు ఆ అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇదే.
మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం లభించింది.ప్రధాని మోదీ ప్రపంచ నాయకత్వానికి గానూ ‘‘ది కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ’’తో సత్కరించారు...
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన సతీమణి అక్షత మూర్తిల సంపద ఈ ఏడాది భారీగా క్షీణించిందని తాజాగా వెలువడిన ‘ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్-2023’ నివేదిక వెల్లడించింది. కేవలం 12 నెలల వ్యవధిలో రిషి-అక్షత దంపతులకు సంబంధించిన 201 మిలియన్ పౌండ్ల సంపద ఆవిరైపోయింది. భారత కరెన్సీలో సుమారు రూ.2వేల కోట్లు అన్నమాట.