PM Modi : ప్రధాని మోదీకి ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం

ABN , First Publish Date - 2023-05-22T11:30:09+05:30 IST

మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం లభించింది.ప్రధాని మోదీ ప్రపంచ నాయకత్వానికి గానూ ‘‘ది కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ’’తో సత్కరించారు...

PM Modi : ప్రధాని మోదీకి ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం
PM Modi Fiji's Highest Civilian Honour

న్యూఢిల్లీ : మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం లభించింది.ప్రధాని మోదీ వహించిన ప్రపంచ నాయకత్వానికి గానూ ‘‘ది కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ’’తో సత్కరించారు.(Prime Minister Narendra Modi)ప్రధాని మోదీ ఫిజీ దేశానికి చెందిన సితివేణి రబుకా నుంచి పతకాన్ని అందుకున్నారు.(Fiji's Highest Civilian Honour)ఫిజియేతర వ్యక్తికి అరుదైన గౌరవంగా పిఎం మోదీని పౌర పురస్కారంతో సత్కరించారు.‘‘ ఫిజీ పౌర పురస్కారం మన ప్రధానికి దక్కడం భారతదేశానికి పెద్ద గౌరవం. మోదీ ప్రపంచ నాయకత్వానికి గుర్తింపుగా ఫిజియేతరులు కొద్దిమంది మాత్రమే ఈ గౌరవాన్ని అందుకున్నారు’’ అని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.

ఇది కూడా చదవండి : Karnataka Ministers: ఎలక్షన్ వాచ్ డాగ్ ఏడీఆర్ సంచలన నివేదిక

రెండు దేశాల మధ్య మైత్రిలో కీలక పాత్ర పోషించిన భారత ప్రజలకు, ఫిజీ-ఇండియన్ ప్రజలకు ప్రధాని మోదీ ఈ గౌరవాన్ని అంకితం చేశారని విదేశాంగ మంత్రిత్వ శాఖ(Ministry of External Affairs) ట్విట్టర్‌లో తెలిపింది.పాపువా న్యూ గినియాలో ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ (ఎఫ్‌ఐపిఐసి) సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోదీ రబుకాను కలిశారు.భారతదేశం, ఫిజీ దేశాల మధ్య సంబంధాలు రాబోయే సంవత్సరాల్లో మరింత పటిష్ఠం చేసేందుకు కలిసి పనిచేయడానికి మేం ఎదురుచూస్తున్నామని ప్రధాన మంత్రి అని మోదీ ట్వీట్ చేశారు.ప్రధాని మోదీకి గతంలో పలు దేశాలు అత్యున్నత పౌర పురస్కారాలు అందించాయి.

Updated Date - 2023-05-22T11:37:17+05:30 IST