Home » Priyanka Gandhi
దేశ ప్రధాని ఎవరుండాలనే ప్రాతిపదికన సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్డీయే, ఇండియా కూటములు అధికారం కోసం ప్రయత్నిస్తున్నాయి. మాదంటే.. మాదంటూ ఎవరికి వాళ్లు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా.. యూపీలో మెజార్టీ సీట్లు గెలవాలి. ఏ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో సత్తా చాటితే ఆ పార్టీనే గెలుపునకు దగ్గరవుతుంది. యూపీలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలున్నాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో అమేథి, రాయ్‌బరేలీ సీట్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
తెలంగాణలో ఎన్నికల ప్రచారంపైన కాంగ్రెస్ అధిష్ఠానం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇప్పటికే తుక్కుగూడ, నిర్మల్, ఆలంపూర్ జనజాతర సభల్లో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ.. ఈ నెల 9న మరో రెండు సభల్లోనూ
కాంగ్రెస్ కంచుకోటగా పేరున్న రాయ్‌బరేలీ, అమేఠీల్లో ఎన్నికల ప్రచారానికి ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక నేతృత్వం వహించనున్నారు.
కాంగ్రెస్ నేత, తన సోదరుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి ‘యువరాజు’ అంటూ ప్రధాని మోదీ ఎద్దేవా పట్ల కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా ధీటైన జవాబిచ్చారు.
లోక్‌సభ ఎన్నికల్లోలో రాయబరేలి నియోజకవర్గాన్ని రాహుల్ గాంధీ ఎన్నుకోవడంపై ఆ పార్టీ బహిష్కృత నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోని రాహుల్ గాంధీ వర్గం, ప్రియాంక వర్గంగా కాంగ్రెస్ పార్టీ చీలిపోనుందని జోస్యం చెప్పారు. పార్టీలో జరుగుతున్న 'కుట్రలో బాధితురాలు ప్రియాంక అని వ్యాఖ్యానించారు.
Telangana: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు మరో వారం రోజుల సమయమే ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రచార జోరును మరింత పెంచింది. కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తెలంగాణకు రానున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రెండు సార్లు రాష్ట్రంలో రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించేలా కాంగ్రెస్ శ్రేణులు షెడ్యూల్‌ను రూపొందించింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన సోదరుడు రాహుల్ గాంధీని యువరాజుగా సంబోధిస్తుండటంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రజల కోసం రాహుల్ 4,000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే, ప్రధాని మోదీ తన రాజభవనంలో కూర్చుని రైతుల దుస్థితిని పట్టించుకోవడం లేదన్నారు.
అమేథి లోక్ సభ నియోజకవర్గం నుంచి గాంధీ కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. గత 31 ఏళ్ల నుంచి గాంధీ కుటుంబ సభ్యులు బరిలోకి దిగారు. అమేథితో గాంధీ కుటుంబానికి 1980 నుంచి అనుబంధం ఉంది.
ఉత్తరప్రదేశ్ అంటే.. ఒకప్పుడు కాంగ్రెస్ అడ్డా. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఇక్కడినుంచే గెలిచి దేశానికి ప్రధానులుగా వ్యవహరించారు.
రాయ్‌బరేలి, అమేథి స్థానాల్లో పోటీపై కాంగ్రెస్‌లో సస్పెన్స్ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక, రాహుల్ గాంధీలు ఈ స్థానాల నుంచి పోటీ చేయనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ రెండు స్థానాలకు రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ పరిస్థితుల్లో నేడు ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకోనుంది. నెహ్రూ-గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా ఈ రెండు స్థానాలు ఉన్నాయి.