Share News

Priyanka Gandhi: రాహుల్ దాడి బీజేపీపైనే, హిందువులపై కాదు: ప్రియాంక

ABN , Publish Date - Jul 01 , 2024 | 09:33 PM

రాహుల్ గాంధీ లోక్‌సభలో చేసిన తొలి ప్రసంగంలోనే హిందువులను కించపరచేలా వ్యాఖ్యలు చేసారంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తోసిపుచ్చారు. రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచారు. తన సోదరుడు ఎప్పుడూ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడరని, రాహుల్ సైతం ఇదే విషయాన్ని లోక్‌సభలో స్పష్టం చేశారని అన్నారు.

Priyanka Gandhi: రాహుల్ దాడి బీజేపీపైనే, హిందువులపై కాదు: ప్రియాంక

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ లోక్‌సభలో చేసిన తొలి ప్రసంగంలోనే హిందువులను కించపరచేలా వ్యాఖ్యలు చేసారంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తోసిపుచ్చారు. రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచారు. తన సోదరుడు ఎప్పుడూ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడరని, రాహుల్ సైతం ఇదే విషయాన్ని లోక్‌సభలో స్పష్టం చేశారని అన్నారు. కేవలం బీజేపీ, ఆ పార్టీ నాయకుల గురించే రాహుల్ మాట్లాడారని తెలిపారు.

Rahul Gandhi: శివుని ఫోటో చూపిస్తూ.. హిందువులపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు


రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రధాని మోదీని, బీజేపీని టార్గెట్ చేసుకొని సోమవారంనాడు విమర్శనాస్త్రాలు సంధించారు. శివుని ఫోటోను చూపిస్తూ, తమని తాము 24 గంటలపాటు హిందువులమని చెప్పుకునేవారిలో హింస, ద్వేషం, అసత్యం పేరుకుపోతోందని బీజేపీని ఉద్దేశిస్తూ విమర్శించారు. హిందూ మతం పేరు చెప్పి బీజేపీ అందరినీ భయపెడుతోందని ఆరోపణలు చేశారు. తమని తాము హిందువులని ప్రచారం చేసుకునేవారు విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, అలాంటి వాళ్లు హిందువులే కారని విమర్శించారు. అసలు హింసని ప్రేరేపించే వాళ్లను హిందువులని ఎలా అనగలమని ప్రశ్నించారు. రాహుల్ వ్యాఖ్యలపై అధికార పార్టీ సభ్యుల నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో తిరిగి రాహుల్ బదులిస్తూ, నరేంద్ర మోదీ ఒక్కరే హిందూ సమాజం కాదని, అలాగే ఆర్ఎస్ఎస్ ఒక్కటే హిందూ సమాజం కాదని చెప్పారు. తాను కేవలం ప్రధాని మోదీని, బీజేపీని, ఆర్ఎస్ఎస్‌ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశానని, మొత్తం హిందూ సమాజాన్ని ఉద్దేశించి కాదని స్పష్టం చేశారు.

Read Latest National News and Telugu News

Updated Date - Jul 01 , 2024 | 09:33 PM