Share News

T20 World Cup 2024: టీమ్ ఇండియా గ్రాండ్ విక్టరీ..ప్రధాని మోదీ, అమిత్ షా, ప్రియాంక విషెస్

ABN , Publish Date - Jun 30 , 2024 | 09:36 AM

టీ20 ప్రపంచకప్‌ 2024ను భారత్‌ గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత క్రికెట్ జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో టీమిండియాకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, ప్రియాంకా గాంధీ శుభాకాంక్షలు తెలియజేశారు.

 T20 World Cup 2024: టీమ్ ఇండియా గ్రాండ్ విక్టరీ..ప్రధాని మోదీ, అమిత్ షా, ప్రియాంక విషెస్
Modi and Amit Shah, priyanka Wishes team india

టీ20 ప్రపంచకప్‌ 2024(t20 World Cup 2024)ను భారత్‌(bharat) గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత క్రికెట్ జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో టీమిండియాకు(team india) అభినందనలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ(narendra Modi).. భారత క్రికెట్ జట్టును చూసి గర్విస్తున్నామని అన్నారు. అదే సమయంలో హోంమంత్రి అమిత్ షా కూడా టీమ్ ఇండియాను అభినందించారు. ఇది దేశానికి గొప్ప గర్వకారణమని అన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ(modi) ఎక్స్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేసి టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు. 'ఛాంపియన్స్‌.. మా జట్టు తనదైన శైలిలో టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టును చూసి గర్విస్తున్నాం. ఈ మ్యాచ్ చరిత్రాత్మకమని తెలిపారు.


మరోవైపు టీ20 ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన టీమిండియాకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా(Amit Shah) కూడా సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా విషెస్ తెలియజేశారు. ఈ గెలుపు దేశానికి గర్వకారణమని అన్నారు. టీ20 ప్రపంచకప్‌లో మా ఆటగాళ్లు అద్భుతమైన క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారు. ఈ చరిత్రాత్మక విజయానికి యావత్ దేశం గర్విస్తోందని పేర్కొన్నారు.


కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi Vadra) కూడా టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో అద్భుత విజయం సాధించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ టీమ్ ఇండియాను అభినందించారు. ఎక్స్‌లో పోస్ట్ చేసి 'హుర్రే! గ్రేట్ టీమ్ ఇండియా! టీ-20 ప్రపంచకప్‌ గెలిచి భారత్‌ చరిత్ర సృష్టించింది. యావత్ దేశానికి ఇది చాలా సంతోషకరమైన సందర్భం. దేశప్రజలందరికీ, మన ఆటగాళ్లందరికీ చాలా అభినందనలు.


ఇది కూడా చదవండి:

Viral Video: హార్దిక్ పాండ్యా కంటనీరు.. ముద్దుపెట్టుకున్న రోహిత్ శర్మ


T20 World Cup Winner India : కప్పు దరిచేరె.. విజేతగా వీడ్కోలు

థాంక్యూ.. ద్రవిడ్‌


Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 30 , 2024 | 09:40 AM