Home » Protest
బంగ్లాదేశ్‌లో(Bangladesh) ప్రభుత్వ రిజర్వేషన్లను సవరించాలని జరుగుతున్న ఆందోళనలు రోజురోజుకూ హింసాత్మకంగా మారుతున్నాయి. శుక్రవారం కొందరు ఆందోళనకారులు.. ఢాకాకు 40 కి.మీల దూరంలో గల నర్సింగ్డిలోని ఓ జైలును ముట్టడించారు.
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. దీంతో పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు కూడా మూతపడ్డాయి. హింసాత్మక ఘటనల నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. బంగ్లాదేశ్‌లో ఉన్న భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది.
హర్యానా, పంజాబ్‌లను వేరుచేస్తూ శంభు సరిహద్దులో ఏర్పాటు చేసిన దిగ్బంధాలను హర్యానా ప్రభుత్వం తొలగించడంతో మరోసారి రైతులు ఢిల్లీకి ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. జంతర్‌మంతర్‌లో కానీ, రామ్‌లీలా మైదానంలో కానీ శాంతియుత నిరసనలకు దిగుతామని భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు జగ్జీత్ సింగ్ దలేవాల్ మంగళవారం తెలిపారు.
పెన్‌పహాడ్ మండలం దోసపాడు గ్రామంలోని గురుకుల పాఠశాలలో 5వ తరగతి విద్యార్థిని సరస్వతి మృతిపై మంత్రులు పొన్నం ప్రభాకర్, కొమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థిని మృతి తీవ్ర ఆవేదనకు గురి చేసిందని రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. చిన్నారి మృతి పట్ల పొన్నం సంతాపం వ్యక్తం చేశారు. బాలిక కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గ్రూప్-2(Group-2) పోస్టులు పెంచాలని, డీఎస్సీ వాయిదా వేసి మెగా డీఎస్సీ(Mega DSC) ప్రకటించాలని ఓయూ ఆర్ట్స్ కళాశాల(OU Arts College) ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదని, ఇచ్చినా అరకొర నోటిఫికేషన్లు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. నోటిఫికేషన్లోనూ ఉద్యోగాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని ఆర్ట్స్ కళాశాల ఎదుట బైఠాయించారు.
విశాఖ: నీట్ పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం విశాఖలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. జీవీఎంసీ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ..
నూజివీడు ట్రిపుల్ ఐటీ ఉద్యోగుల నిరసనతో క్యాంపస్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లుగా జీతాలు పెంచకుండా తమను వేధించారంటూ ఆర్జీయుకేటీ ఛాన్స్లర్ కె.సి.రెడ్డిని (RGUKT Chancellor KC Reddy) యూనివర్శిటీలోకి రానివ్వకుండా ఉద్యోగులు అడ్డుకున్నారు.
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(AEE) పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినా తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థులకు ఇంతవరకూ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వకపోవడం బాధాకరమని ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు(MLA Harish Rao) అన్నారు. గాంధీ భవన్ వద్ద మోకాళ్లపై నిరసన తెలుపుతున్న AEE అభ్యర్థులకు ఎక్స్(ట్విటర్) వేదికగా ఆయన సంఘీభావం తెలిపారు.
మైసమ్మగూడ ప్రాంతంలోని మల్లారెడ్డి యూనివర్సిటీ (Mallareddy University)లో విద్యార్థులు మరోసారి ఆందోళన (Students Protest)కు దిగారు. అన్నంలో పురుగులు వస్తున్నాయంటూ యూనివర్శిటీ ఎదుట బైఠాయించి "మల్లారెడ్డి డౌన్ డౌన్" అంటూ నినాదాలు చేశారు. ఎన్నిసార్లు చెప్పినా తమ సమస్యను యాజమాన్యం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చుతోందని ఆరోపించారు. ధర్నాలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.