Share News

Supreme Court: దల్లేవాల్‌కు వైద్య సహాయం.. పంజాబ్ సర్కార్‌కు మరింత గడువు ఇచ్చిన సుప్రీం

ABN , Publish Date - Dec 31 , 2024 | 02:57 PM

దల్లేవాల్ ఆరోగ్య పరిస్థితి, పంజాబ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై జస్టిస్ సూర్యకాంత్, సుదాన్షు ధులియాతో కూడిన వెకేషన్ బెంచ్ మంగళవారం సమీక్షించింది. పంజాబ్ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గుర్మీందర్ సింగ్ హాజరయ్యారు.

Supreme Court: దల్లేవాల్‌కు వైద్య సహాయం.. పంజాబ్ సర్కార్‌కు మరింత గడువు ఇచ్చిన సుప్రీం

న్యూఢిల్లీ: రైతుల డిమాండ్ల సాధన కోసం రైతు నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్‌(Jagjit Singh Dallwal) చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మంగళవారంతో 36వ రోజుకు చేరుకుంది. ఆయనను వైద్య సహాయం అందించాలంటూ పంజాబ్ సర్కార్‌కు సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అయితే అందుకు తాము చేస్తున్న ప్రయత్నాలను పంజాబ్ ప్రభుత్వం వివరిస్తూ తమకు మరింత గడువు ఇవ్వాలని కోరడంతో అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. తదుపరి విచారణను జనవరి 2వ తేదీకి వాయిదా వేసింది.

Year End Sunrise: 2024 చివరి సూర్యోదయం ఎందుకంత స్పెషల్


దల్లేవాల్ ఆరోగ్య పరిస్థితి, పంజాబ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై జస్టిస్ సూర్యకాంత్, సుదాన్షు ధులియాతో కూడిన వెకేషన్ బెంచ్ మంగళవారం సమీక్షించింది. పంజాబ్ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గుర్మీందర్ సింగ్ హాజరయ్యారు. కోర్టు డిసెంబర్ 20న ఇచ్చిన ఆదేశాలు అమలుకు మరో మూడు రోజులు సమయం ఇవ్వాలని కోరారు. దల్లేవాల్‌ను సమీప ఆసుపత్రికి తరలించేందుకు నిరసన దీక్షా శిబిరం వద్ద రైతు నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. వైద్య సహాయం అందిస్తామని ఈ నెల 29న వైద్యుల బృందం చెప్పినప్పటికీ దల్లేవాల్ నిరాకరించారని, బలవంతంగా తరలిస్తే ఇరువైపులా సమస్యలు తలెత్తవచ్చని గుర్మీందర్ కోర్టుకు విన్నవించారు. దీనికోసం మరింత సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. అందుకు అంగీకరించిన న్యాయస్థానం తుదపరి విచారణను జనవరి 2వ తేదీకి వాయిదా వేసింది.


పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం సహా పలు డిమాండ్లతో పంజాబ్-హర్యానా సరిహద్దుల్లోని ఖనౌరి శిబిరం వద్ద దల్లేవాల్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. దీనిపై డిసెంబర్ 28న సుప్రీంకోర్టు విచారణ జరిపి పంజాబ్ సర్కార్‌పై మండిపడింది. దల్లేవాల్‌‌కు వైద్య సాయం అందకుండా రైతులు అడ్డుపడటం సరికాదని పేర్కొంది. డిసెంబర్ 31వ తేదీలోగా దల్లేవాల్‌ను ఒప్పించి ఆసుపత్రికి తరలించాలని ఆదేశించింది. అవసరమైతే కేంద్రం సాయం తీసుకోవాలని కూడా సూచించింది.


ఇవి కూడా చదవండి..

CM MK Stalin : కన్యాకుమారిలో అద్దాల వంతెన

‘మహా’ కుంభమేళా!

Read More National News and Latest Telugu News

Updated Date - Dec 31 , 2024 | 03:02 PM