BRS: బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు
ABN , Publish Date - Jan 06 , 2025 | 08:27 AM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నాయకత్వంలో పార్టీ కేడర్ సోమవారం అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతులకు హామీ ఇచ్చిన ప్రతీ ఏడాదికి ఎకరాకు రూ.15 వేలు పెట్టుబడి సాయం అందించడంలో విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకం (Farmer Assurance Scheme)పై కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt.) తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ (BRS) సోమవారం రాష్ట్రవ్యాప్త ఆందోళన (Protest)లకు పిలుపు ఇచ్చింది. అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ నిరసనలు తెలుపనుంది. రైతు బరోసా రూ.15 వేలు ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి రైతుబరోసా రూ. 12 వేలు ప్రకటించి రైతులను వంచన చేశారని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం రూ.15 వేలు పంట పెట్టుబడి ఇచ్చేవరకు ఆందోళనలు చేస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే సీఎం రేవంత్ రైతు బరోసా ప్రకటించారని కేటీఆర్ విమర్శించారు. గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని బీఆర్ఎస్ క్యాడర్‌కు కేటీఆర్ పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నాయకత్వంలో పార్టీ కేడర్ అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతులకు హామీ ఇచ్చిన ప్రతీ ఏడాదికి ఎకరాకు రూ.15 వేలు పెట్టుబడి సాయం అందించడంలో విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. రూ.12 వేలకు తగ్గించిన ఈ సాయాన్ని “రైతులపై ద్రోహం”గా అభివర్ణిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది.
ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని రూ.12 వేలకు కుదించడం రైతులను నిలువునా వంచించడమేనని, తెలంగాణ రైతాంగం ఈ ద్రోహాన్ని క్షమించరని కేటీఆర్ అన్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ చేతిలో మోసపోతున్నది రైతన్నలేనని, కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, దగా, నయవంచన అని మరోసారి రుజువైందని అన్నారు. నమ్మి ఓటేసిన పాపానికి మోసానికి పాల్పడిన కాంగ్రెస్‌ను రైతన్నలు పాతరేస్తారని అన్నారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేని ఈ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తీరు రైతాంగానికి వ్యతిరేకమని, రైతులకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉందని, వారి హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్పుకుంటూ ఎన్నికల హామీలను అమలు చేయకుండా కపటనీతిని ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ నిరసన కార్యక్రమాల ద్వారా నిలదీస్తామని బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి అన్నారు. రైతులకు చేస్తున్న మోసాలను ఎండగడతామని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన రైతాంగానికి సంఘీభావంగా సోమవారం జరగనున్న నిరసన కార్యక్రమాలలో నిజామాబాద్ జిల్లా రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటన
ఇక ప్రతి ఇల్లూ విద్యుత్కేంద్రమే..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News