Share News

Bangladesh: బంగ్లా నేత పోస్టుపై భారత్ తీవ్ర నిరసన

ABN , Publish Date - Dec 20 , 2024 | 07:00 PM

మహపుజ అలం ఇటీవల ఫేస్‌బుక్ ఫోస్ట్‌లో బంగ్లాదేశ్, ఈశాన్య రాష్ట్రాల సంస్కృతులు ఒకేలా ఉంటాయని, కొందరు ఉన్నత వర్గాలకు చెందిన హిందువులు బంగ్లా వ్యతిరేక ధోరణుల వల్లే బంగ్లాదేశ్ ఏర్పాటు జరిగిందని వ్యాఖ్యానించారు.

Bangladesh: బంగ్లా నేత పోస్టుపై భారత్ తీవ్ర నిరసన

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్-భారత్ మధ్య సంబంధాలు ఇటీవల కాలంలో క్షీణిస్తున్న నేపథ్యంలో అక్కడి తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ సన్నిహితుడు మహపుజ ఆలం ఇటీవల వివాదాస్పద పోస్ట్ పెట్టారు. దీనిపై భారత ప్రభుత్వం తీవ్ర స్థాయిలో స్పందించింది. ఆ దేశానికి తమ నిరసనను తెలియజేసింది. మహపుజ అలం ఇటీవల ఫేస్‌బుక్ ఫోస్ట్‌లో బంగ్లాదేశ్, ఈశాన్య రాష్ట్రాల సంస్కృతులు ఒకేలా ఉంటాయని, కొందరు ఉన్నత వర్గాలకు చెందిన హిందువులు బంగ్లా వ్యతిరేక ధోరణుల వల్లే బంగ్లాదేశ్ ఏర్పాటు జరిగిందని వ్యాఖ్యానించారు. దీనిపైనే భారత్ ఘాటుగా స్పందించింది.

Yogi Adityanath: ఔరంగజేబు వారసులపై యోగి సంచలన వ్యాఖ్యలు


"బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వంతో సంబంధాలను పెంపొందించేందుకు భారత్ ఆసక్తి చూపుతోంది. కానీ ఈ తరహా చర్యలకు బంగ్లా నేతలు పాల్పడుతుండటం నిరాశ కలిగిస్తున్నాయి. ఈ విషయాన్ని బంగ్లా ప్రభుత్వం వద్ద లేవనెత్తాం. ఆ తర్వాత సోషల్ మీడియా పోస్ట్‌ను వారు తొలగించారు. నేతలు బహిరంగ ప్రకటనలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది"' అని భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ శుక్రవారంనాడు ఏర్పాటు చేసిన మీడియా సమాశంలో తెలిపారు.


పన్నూన్ బెదిరింపులపై యూఎస్ దృష్టికి

కాగా, అమెరికాలోని ఇండియన్ రాయబారి వినయ్ మోహన్ ఖ్వాత్రాపై నిఘా పెట్టాలంటూ సిక్కు వేర్పాటువాది గుర్‌ప్రీత్ సింగ్ పన్నూన్ చేసిన బెదిరింపులను తాము సీరియస్‌గా తీసుకున్నట్టు కూడా జైశ్వాల్ తెలిపారు. పన్నూన్ బెదిరింపుల విషయాన్ని, దౌత్యవేత్తల భద్రతా పరమైన ఆందోళనను అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లామని, భారత్ ఆందోళనను యూఎస్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని తాము ఆశిస్తున్నామని చెప్పారు.


ఇవి కూడా చదవండి:

Fadnavis: మీరు ఏదో ఒక రోజు సీఎం అవుతారు.. అజిత్ పవార్‌పై ఫడ్నవీస్ వ్యాఖ్యలు

Sabarimala: శబరిమలలో మండల పూజకు సిద్ధం

Read More National News and Latest Telugu News

Updated Date - Dec 20 , 2024 | 07:05 PM