Home » Protest
యునైటెడ్ కిసాన్ మోర్చా(united kisan morcha) గురువారం సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26న ట్రాక్టర్ మార్చ్, మార్చి 14న ఢిల్లీలో ర్యాలీ నిర్వహిస్తామని రైతు నేతలు ప్రకటించారు.
రైతుల ఆందోళనలో విషాదం చోటుచేసుకుంది. హర్యానాలోని ఖనౌరి సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతు ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య బుధవారం సాయంత్ర ఘర్షణ చోటుచేసుకోగా, ఒక రైతు మృతి చెందాడు. తాజా ఘటనతో రెండ్రోజుల పాటు 'ఢిల్లీ మార్చ్'ను రద్దు చేస్తున్నట్టు ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రకటించింది.
రైతులతో మరోసారి చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా తెలిపారు. ఇప్పటికే నాలుగు విడతల చర్చలు విఫలం కాగా..ఇప్పుడు మరోసారి చర్చలకు రావాలని కేంద్రం కోరింది.
తమ డిమాండ్ల సాధన కోసం శంభు సరిహద్దులో బుల్డోజర్ లతో రైతులు నిరసన చేపట్టారు. కంచెలు తెంచేసి దేశ రాజధాని వైపు తరలివచ్చేందుకు పక్కా ప్రణాళికలు వేసుకుంటున్నారు.
కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు బుధవారం రోజు పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 21న ఉదయం 11 గంటలకు పాదయాత్ర చేస్తామని రైతులు కేంద్రాన్ని హెచ్చరించారు.
కనీస మద్దతు ధరపై చట్టం చేయాలనే డిమాండ్తో సహా పలు డిమాండ్ల సాధనకు ఆందోళన సాగిస్తున్న రైతులను పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు మంగళవారంనాడు మందలించింది. మోటార్ వాహనాల చట్టం ప్రకారం హైవేలపై వారు ట్రాక్టర్ ట్రాలీలను వాడరాదని స్పష్టం చేసింది.
ఎంఎస్ఏపీ, రుణమాఫీ సహా పలు డిమాండ్ల కోసం ఢిల్లీకి పాదయాత్ర చేయాలని పట్టుదలతో ఉన్న రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం జరిపిన నాలుగో దఫా చర్చలు కూడా విఫలమయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీ సహా పలు చోట్ల రైతుల నిరసనల కారణంగా CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా వేసినట్లు ఓ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ అంశంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) శుక్రవారం స్పందించింది.
డిమాండ్ల సాధనకు ఉద్యమిస్తు్న్న అన్నదాతల గొంతు అణిచివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని రైతు నేతలు శుక్రవారంనాడు ఆరోపించారు. రైతులు, యూట్యూబర్ల సోషల్ మీడియా అకౌంట్లను కేంద్రం సస్పెండ్ చేసినట్టు రైతు నేత ర్వణ్ సింగ్ పాంథెర్ ఆరోపించారు. ఆరోపించారు
తమ డిమాండ్ల సాధనకు రైతులు చేపట్టిన ర్యాలీలో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా భారత్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా సహా వివిధ రైతు సంఘాలు ఫిబ్రవరి 16న భారత్ బంద్కు పిలుపునిచ్చాయి.