Railway News: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ రోజు నుంచి రైళ్లన్నీ బంద్..
ABN , Publish Date - Mar 01 , 2024 | 07:54 PM
కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైల్వే యూనియన్ సంఘాల నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే మే 1 నుంచి
కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైల్వే యూనియన్ సంఘాల నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే మే 1 నుంచి దేశవ్యాప్తంగా అన్ని రైళ్ల ( Trains ) సేవలను నిలిపివేస్తామని హెచ్చరించారు. కొత్త పెన్షన్ స్కీమ్ స్థానంలో డిఫైన్డ్ గ్యారెంటీడ్ పాత పెన్షన్ స్కీమ్‌ని పునరుద్ధరించాలని కోరారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే సర్వీసులు నిలిపివేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని జేఎఫ్ఆర్ఓపీఎస్ యూనిన్ కన్వీనర్ శివ గోపాల్ మిశ్రా స్పష్టం చేశారు.
ఇందుకు సంబంధించి మార్చి 19 న అధికారికంగా రైల్వే మంత్రిత్వ శాఖకు నోటీసు అందించనున్నారు రైల్వే కార్మికులు. తమ ప్రతిపాదనను తెలిపి, దేశవ్యాప్తంగా సమ్మె గురించి తెలియజేయనున్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అయిన మే 1, 2024 నుంచి అన్ని రైలు సర్వీసులను నిలిపివేయనున్నట్లు అధికారులకు సమాచారం ఇవ్వనున్నారు. కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మిశ్రా వివరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.