Share News

Sonam Wangchuk: ర్యాలీకి పిలుపునిచ్చిన సోనమ్ వాంగ్‌చుక్.. జిల్లాలో ఇంటర్ నెట్ బంద్, 144 సెక్షన్

ABN , Publish Date - Apr 06 , 2024 | 07:07 AM

లడఖ్‌(Ladakh)కు పూర్తి రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్(Sonam Wangchuk) ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ నిరాహార దీక్ష నేపథ్యంలో అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే ఆయన ఏప్రిల్ 7న పష్మీనా మార్చ్ ప్రకటించారు. దీని దృష్ట్యా లెహ్‌లో పోలీసులు 144 సెక్షన్ విధించారు.

Sonam Wangchuk: ర్యాలీకి పిలుపునిచ్చిన సోనమ్ వాంగ్‌చుక్.. జిల్లాలో ఇంటర్ నెట్ బంద్, 144 సెక్షన్
climate activist Sonam Wangchuk

లడఖ్‌(Ladakh)కు పూర్తి రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్(Sonam Wangchuk) ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ నిరాహార దీక్ష నేపథ్యంలో అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే ఆయన ఏప్రిల్ 7న పష్మీనా మార్చ్(Pashmina march) ప్రకటించారు. ఈ ర్యాలీ లేహ్ నుంచి ప్రారంభమై దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న చైనా సరిహద్దు వరకు కొనసాగనుంది. దీని దృష్ట్యా లెహ్‌లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఐదు మంది కంటే ఎక్కువ గుమికూడరాదని, ఇంటర్ నెట్ సేవలు కూడా రద్దు చేశారు.


లేహ్ జిల్లా(leh district)లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ సెక్షన్ విధించినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ సెక్షన్‌ను అమలు చేస్తున్న నేపథ్యంలో ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్రాతపూర్వక అనుమతి లేకుండా జిల్లాలో ఊరేగింపు/ర్యాలీ/మార్చ్ మొదలైనవాటిని అనుమతించబోమని తెలిపారు. దీంతోపాటు ముందస్తు అనుమతి లేకుండా ఎవరూ వాహనానికి అమర్చిన లేదా ఇతర లౌడ్ స్పీకర్లను ఉపయోగించకూడదని వెల్లడించారు.


కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌కు పూర్తి రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ సోనమ్ వాంగ్‌చుక్ మార్చి 26 నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వడంతో పాటు రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో చేర్చాలన్నది ఆయన డిమాండ్. అతని సమ్మెకు లేహ్, కార్గిల్‌లోని పలువురి నుంచి ఆయనకు మద్దతు లభిస్తోంది.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సోనమ్ వాంగ్‌చుక్ ఓ పోస్ట్ చేశారు. శాంతియుత లడఖ్ చాలా గందరగోళంగా ఉంది!. 31 రోజులపాటు అత్యంత శాంతియుత ప్రార్థనలు, ఉపవాసాల తర్వాత అకస్మాత్తుగా మారిపోయిందన్నారు. పరిపాలన చొరవ అన్నింటికంటే ప్రమాదకరంగా కనిపిస్తోందన్నారు.


ఇది కూడా చదవండి:

Manifesto : పాంచ్‌ న్యాయ్‌.. పచ్చీస్‌ గ్యారెంటీ


పాక్‌ ఉగ్రవాదులపై ‘రా’ గురి!


మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 06 , 2024 | 07:47 AM