Home » Pulivendula
ఆరుగాలం శ్రమించి సాగుచేసిన ఉల్లి, పత్తి పంటలు వర్షం పాలయ్యాయి. వీరపునాయునిపల్లె మండలంలోని కొమ్మద్ది గ్రామంలో బోరుబావుల కింద సాగుచేసిన ఉల్లి, పత్తి పంటలు దాదాపు 200 ఎకరాలు వర్షంతో దెబ్బతిన్నాయి.
చదువుతో పాటు క్రీడలు ముఖ్యమేనని పులివెందుల టీడీపీ ఇనచార్జి మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్‌రవి) పేర్కొన్నారు.
ఓ పక్క పదిరూపాయల నాణెం చెల్లుతుందని ఆర్బీఐ చెబుతున్నా నాణేలు తీసుకునేందుకు వ్యాపా రులు నిరాకరిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లోనూ.. చివరికి పెట్రోలు బంకుల్లో సైతం ఇదే పద్ధతి అవలంభిస్తున్నారు.
వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహనరెడ్డి అవగాహనరాహిత్యం, తొందరపాటు నిర్ణయాలతో విద్యారంగాన్ని భ్రష్టుపట్టించారని ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి విమర్శించారు.
ప్రభుత్వ ఉద్యోగికి బదిలీ సహజం. అయితే రాజకీయ నాయకులను, అధికారులను డబ్బుతో గుప్పెట్లో పెట్టుకున్న అధికారులు ఏళ్లు గడుస్తున్నా అదే ఏరియాలో తిష్టవేస్తున్నారు. మేం ఎన్నేళ్లయినా ఉంటాం, ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళి అర్పించారు.
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి(YS Rajashekar Reddy) వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్(YS Jagan) సోషల్ మీడియాలో భావోద్వేగానికి గురయ్యారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అభిమానంతో సుదూర ప్రాంతాల నుంచి కలవడానికి వచ్చిన మహిళలపై రోప్ పార్టీ పోలీసులు దాష్టీకం చూపించారు. సుదూర ప్రాంతాల నుంచి జగన్‌ను కలిసేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన అభిమానులపై ఇలా పోలీసులు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
అది జగన్(YS Jagan) రెడ్డి సొంత అడ్డా పులివెందుల(Pulivendula). అక్కడ వైసీపీ శ్రేణులు ఎన్ని అవినీతి, అక్రమాలకు పాల్పడినా అడిగే ధైర్యం ఎవ్వరికీ ఉండదు. అది జగన్ రెడ్డి హయాంలో అంటే ఒకే. ఇప్పుడు టీడీపీ హయాంలో కూడా వారు యథాతథంగా అక్రమాలు కొనసాగిస్తున్నారు.
మూడురోజుల పర్యటనలో భాగంగా కడప జిల్లా పులివెందులకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోరోజు ఆదివారం పులివెందుల పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు.