mlc ramgopal విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిన వైసీపీ : ఎమ్మెల్సీ
ABN , Publish Date - Sep 13 , 2024 | 11:31 PM
వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహనరెడ్డి అవగాహనరాహిత్యం, తొందరపాటు నిర్ణయాలతో విద్యారంగాన్ని భ్రష్టుపట్టించారని ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి విమర్శించారు.
వేంపల్లె, సెప్టెంబరు 13: వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహనరెడ్డి అవగాహనరాహిత్యం, తొందరపాటు నిర్ణయాలతో విద్యారంగాన్ని భ్రష్టుపట్టించారని ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి విమర్శించారు. ఉపాధ్యాయులకు సరైన శిక్షణ, మౌలిక వసతులు లేకుండానే పాఠశాలల్లో సీబీఎ్‌సఈ ప్రవేశపెట్టారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఈ ఏడాది సీబీఎ్‌సఈ సిలబ్‌సలో కాకుండా స్టేట్ సిలబ్‌సలోనే 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకుందన్నారు. ఆయన శుక్రవారం వేంపల్లెలోని ఉర్దూ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం సరఫరాచేసిన బ్యాగులను వారికి అందజేశారు. ఆటలపోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందించారు. కళాశాల ఆవరణంలో ఆర్జేడీ రవి, ఆర్‌ఐఓ సుబ్బయ్యతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం ఏర్పాటుచేసి పేద విద్యార్థులకు చదువులు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కళాశాల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీసీకెమెరాల ఏర్పాటుకు ఆర్థిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మాజీ ఎంపీటీసీ సభ్యుడు జీవీ రమణ, టీడీపీ నాయకులు పోతిరెడ్డి శివ, భానుకిరణ్, దేశం వెంకటసుబ్బారెడ్డి, మైసూరారెడ్డి, బాబా షరీఫ్, పఠానఖాన తదితరులు పాల్గొన్నారు.