Share News

Sports are important చదువుతో పాటు క్రీడలు ముఖ్యమే

ABN , Publish Date - Sep 20 , 2024 | 11:56 PM

చదువుతో పాటు క్రీడలు ముఖ్యమేనని పులివెందుల టీడీపీ ఇనచార్జి మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్‌రవి) పేర్కొన్నారు.

Sports are important చదువుతో పాటు క్రీడలు ముఖ్యమే
వేంపల్లెలో రాష్ట్రస్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీలను ప్రారంభిస్తున్న రవీంద్రనాథరెడ్డి

వేంపల్లె, సెప్టెంబరు 20: చదువుతో పాటు క్రీడలు ముఖ్యమేనని పులివెందుల టీడీపీ ఇనచార్జి మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్‌రవి) పేర్కొన్నారు. వేంపల్లెలోని జిల్లా పరిషత బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్‌ బాలబాలికల హ్యాండ్‌బాల్‌ పోటీలను పులివెందుల బీటెక్‌ రవి ప్రారంభించి.. వివిధ జిల్లాల నుంచి హాజరైన హ్యాండ్‌బాల్‌ క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బీటెక్‌ రవి మాట్లాడుతూ కోట్లాది జనాభా ఉన్న భారతదేశానికి ఒలంపిక్‌లాంటి క్రీడల్లో పతకాలు తక్కువగా వస్తుంటాయని, తక్కువ జనాభా ఉన్న దేశాలకు ఒలంపిక్‌ క్రీడల్లో ఎన్నో పతకాలు వస్తున్నాయని తెలిపారు. మన దేశంలో పిల్లలకు క్రీడలపై ఆసక్తిని పెంపొందించడంలో తల్లిదండ్రులు ముఖ్యభూమికి పోషించాలని.. ఉపాధ్యాయులు చదువుతో పాటు ఆటలు ఆడడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజెప్పాలన్నారు. అనంతరం హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బీటెక్‌ రవిని సత్కరించారు. కార్యక్రమంలో ఫిజికల్‌ డైరెక్టర్లు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు, హ్యాండ్‌బాల్‌ అసోసియేషన ప్రతినిదులు, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2024 | 11:56 PM