cotton crops were damaged 200ఎకరాలకు పైబడి దెబ్బతిన్న ఉల్లి, పత్తిపంటలు
ABN , Publish Date - Sep 26 , 2024 | 11:51 PM
ఆరుగాలం శ్రమించి సాగుచేసిన ఉల్లి, పత్తి పంటలు వర్షం పాలయ్యాయి. వీరపునాయునిపల్లె మండలంలోని కొమ్మద్ది గ్రామంలో బోరుబావుల కింద సాగుచేసిన ఉల్లి, పత్తి పంటలు దాదాపు 200 ఎకరాలు వర్షంతో దెబ్బతిన్నాయి.
వీరపునాయునిపల్లె, సెప్టెంబరు 26: ఆరుగాలం శ్రమించి సాగుచేసిన ఉల్లి, పత్తి పంటలు వర్షం పాలయ్యాయి. వీరపునాయునిపల్లె మండలంలోని కొమ్మద్ది గ్రామంలో బోరుబావుల కింద సాగుచేసిన ఉల్లి, పత్తి పంటలు దాదాపు 200 ఎకరాలు వర్షంతో దెబ్బతిన్నాయి. బుధవారం రాత్రి మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో గ్రామానికి చెందిన దాదాపు 50 మంది రైతులు సాగు చేసిన సుమారు 200ఎకరాలకు పైబడి ఉల్లి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. ఉల్లి సాగు చేసేందుకు ఎకరాకు రూ.70వేల నుంచి రూ.80వేల వరకు ఖర్చు అయింవని, ఉల్లిగడ్డలు కూలీలతో పీకించి పొలం మీదనే ఆరబెట్టామని అంతలోపే వర్షం కురవడంతో పంట అంతా దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దెబ్బతిన్న పంటలను జిల్లా అధికారులు పరిశీలించి తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.