Home » Purandeswari
విజయవాడ: ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మంగళవారం ఉదయం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యే లతో సమావేశం అయ్యారు. శాసన సభ పక్ష నేత ఎంపికపై చర్చలు జరుపుతున్నారు. అధిష్టానం ప్రకటనకు అందరూ కట్టుబడి ఉండాలని నిర్ణయించారు.
ఏపీలో అధికారంలోకి రావాలంటే గోదావరి జిల్లాల్లో గెలవాలనేది ఒక సెంటిమెంట్. ఈ రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ మెజార్టీ సీట్లు గెలిచిన పార్టీ ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది.
ఏపీ ఓటర్ల తీర్పు వన్‌సైడ్‌గా ఉన్నట్లు ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్లలో ఎక్కువ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు అధిక్యం కనబర్చగా.. ఈవీఎంల కౌంటింగ్ తర్వాత కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కువ నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు మొదటి రౌండ్లో అధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అప్పులు తెచ్చారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి (Purandheswari)అన్నారు.
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మంగళవారం ఉదయం ఆయన కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి ఎన్టీఆర్ ఘట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు.
కార్యకర్తలే పార్టీకి ప్రధాన బలమని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari) స్పష్టం చేశారు. బీజేపీ(BJP) రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో భాగంగా ఈ మేరకు పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆధారిత పార్టీ అని పురంధేశ్వరి ఈ సందర్భంగా అన్నారు.
ఏపీలో ఉన్న పరిశ్రమలను ఐదేళ్లలో వైసీపీ (YSRCP) ప్రభుత్వం దెబ్బతీసిందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Purandeswari) అన్నారు. రాష్ట్రంలో కోళ్ల పెంపకం పెద్ద సంఖ్యలో జరుగుతుందని చెప్పారు. 2019కి ముందు కోళ్ల పెంపకానికి సంబంధించి రైతులకు ఇంట్రెస్ట్ సబ్సిడీ సౌకర్యం ఇచ్చేవారని తెలిపారు. 2019 నుంచి 2024 వరకు వారికి ఇచ్చే సబ్సిడీ పూర్తిగా ఎత్తేశారని మండిపడ్డారు.
మంత్రి బొత్స సత్యనారాయణపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. పచ్చకామెర్ల వారికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందని అన్నారు. అవినీతి చేసే వారికి అంతా అవినీతిమయంగానే కనిపిస్తుందని పురందేశ్వరి ఫైర్ అయ్యారు. బొత్స చేసిన వోక్స్ వాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు.
Andhrapradesh: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలంలో రాజమండ్రి ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి, గోపాలపురం కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. గడిచిన ఐదు సంవత్సరాలలో రాష్ట్రం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని విమర్శించారు. పంచాయతీ నిధులు దారి మళ్ళించారని ఆరోపించారు. ఈ వర్గానికి సంపూర్ణ న్యాయం చేయని పరిపాలన సాగించారన్నారు.
ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వచ్చేసింది. ఈ నెల 7, 8 తేదీలలో రోడ్ షో, సభలు నిర్వహించనున్నారు. రాజమహేంద్రవరంలో పురందేశ్వరికి మద్దతుగా 7న సాయంత్రం 3.30 గంటలకు వేమగిరిలో సభలో మోదీ ప్రసంగించనున్నారు