Share News

Purandeshwari: ఏపీలో తిరంగా యాత్ర.. ప్రారంభించిన పురందేశ్వరి

ABN , Publish Date - Aug 13 , 2024 | 01:49 PM

Andhrapradesh: బీజేపీ ఎన్డీఏ పక్షాల భాగస్వామ్యంతో తిరంగా యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేవైఎం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా యాత్రను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. నేటి స్వాతంత్ర ఫలాలు ఆనాటి నేతల పోరాట ఫలితమన్నారు. ఈ చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియచేయాలన్నారు.

Purandeshwari: ఏపీలో తిరంగా యాత్ర.. ప్రారంభించిన పురందేశ్వరి
AP BJP chief Purandeshwari

అమరావతి, ఆగస్టు 13: బీజేపీ ఎన్డీఏ పక్షాల భాగస్వామ్యంతో తిరంగా యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేవైఎం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా యాత్రను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (AP BJP Chief Purandeshwari) ప్రారంభించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. నేటి స్వాతంత్ర ఫలాలు ఆనాటి నేతల పోరాట ఫలితమన్నారు. ఈ చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియచేయాలన్నారు.

Tummala: సీఎం రేవంత్ సభను విజయవంతం చేయాలి


దేశమంతా విద్యార్ధులతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జాతి యావత్తు ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని అన్నారు. పార్టీలకు అతీతంగా దేశమంతా జాతీయ జెండాను ప్రతి ఇంటిపైన ఆవిష్కరించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి తిరంగా యాత్ర గురించి వివరించామన్నారు. జాతీయ జెండా చేత బూని తిరంగా యాత్రలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని పురందేశ్వరి వెల్లడించారు.

Minister Seethakka: స్వచ్ఛదనంపై మ‌రింత శ్రద్ధ పెర‌గాలి


మరోవైపు ఈరోజు ఢిల్లీలోనూ తిరంగా యాత్ర చేమనున్నారు. భారత మండపం నుంచి ధ్యాన్‌చంద్ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. తిరంగా యాత్రలో పలువురు ఎంపీలు పాల్గొననున్నారు. ఆగస్టు 9 నుంచి 15 వరకు ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం ప్రదర్శించాలని... మువ్వన్నెల జెండాతో సెల్ఫీలను అప్‌లోడ్ చేసేందుకు వెబ్ సైట్ harghartiranga.com‌ను ఏర్పాటు చేశారు. 2022 నుంచి ఈ వెబ్‌సైట్ అందుబాటులో ఉంది. 2022లో 6 కోట్లు, 2023లో 10 కోట్ల మంది సెల్ఫీల అప్‌లోడ్ చేశారు. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిస్‌ప్లే పిక్చర్‌ను మార్చి త్రివర్ణ పతాకాన్నిపెట్టారు. నేడు జరిగే త్రివర్ణ బైక్ ర్యాలీలో పాల్గొనాలని దేశంలోని ఎంపీలందరినీ కేంద్ర ప్రభుత్వం కోరింది. నేటి త్రివర్ణ బైక్ ర్యాలీలో పాల్గొనాలని అన్ని పార్టీల ఎంపీలకు విజ్ఞప్తి చేసింది.ఇది రాజకీయాలకు అతీతమైన అంశమని కేంద్రం పేర్కొంది. గతేడాది 23 కోట్ల ఇళ్లలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినట్లు కేంద్రం పేర్కొంది.


ఇవి కూడా చదవండి...

AP News: మాదకద్రవ్యాల నిర్మూలన కోసం అధికారుల ప్రయత్నం ఫలించేనా?

Drugs Case: గుంటూరులో డ్రగ్స్ కేసు కలకలం...

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 13 , 2024 | 01:52 PM