Prandeshwari: కూటమి ప్రభుత్వ సారధ్యంలో ఏపీ అభివృద్ధి ఖాయం
ABN , Publish Date - Sep 13 , 2024 | 01:32 PM
Andhrapradesh: వరద సహాయక చర్యల్లో పాల్గొన్న పారిశుద్ద్య కార్మికులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సన్మానించారు. వరద అనంతరం ప్రాంతాలను క్లీన్ చేయడంలో కార్మికుల కృషి చెప్పలేనిదంటూ వారికి వస్త్రాలను అందజేశారు. అనంతరం పురేందేశ్వరి మాట్లాడుతూ... విజయవాడ, గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు.
విజయవాడ, సెప్టెంబర్ 13: ఎన్డీఏ ప్రభుత్వం ఏపీ అభివృద్దికి కూడా ప్రాధాన్యత ఇస్తోందని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి (AP BJP Chief Daggubati Purandeshwari) అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉపాధ్యాయులు, మేధావులు, విద్యావంతులతో దగ్గుబాటి పురంధేశ్వరి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. ఎన్డీఏ ప్రభుత్వం ఏపీ అభివృద్దికి కూడా ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఏపీకి అన్యాయం చేయాలనే ఆలోచన బీజేపీకి ఎప్పుడూ లేదని తెలిపారు.
AP Highcourt: కొల్లు రవీంద్ర పాస్‌పోర్టును పునరుద్దరించండి.. హైకోర్టు ఆదేశం
అమరావతి రాజధాని అభివృద్దికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. 2500 కోట్లు నేరుగా నిధులు కూడా గతంలో మంజూరు చేసిందని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి 20వేల కోట్లు డీపీఆర్ ఓకే చేశారని తెలిపారు. ఇంటర్నెల్స్ రోడ్ల విస్తరణకు గడ్కరీ ఆమోదం తెలిపారన్నారు. అమరావతి ఏపీ రాజధాని కాబట్టే కేంద్రం కూడా ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. రైల్వే జోన్ విషయంలో గత ప్రభుత్వం అనుకూలమైన ప్రదేశం ఇవ్వలేదని.. ఆ స్థలం మార్చాలని కోరినా గత ప్రభుత్వం స్పందించలేదన్నారు. చంద్రబాబుకు లేఖ రాశారని.. ఆమోదం రాగానే రైల్వే జోన్ పనులు జరుగుతాయన్నారు.
పోలవరం విషయంలో తెలిసీ తెలియని పరిస్థితులు కొన్ని ఉత్పన్నం అయ్యాయన్నారు. నిర్మాణం అయిన డయా ఫ్రం వాల్ దెబ్బ తినడం బాధాకరమన్నారు. నీటి నిల్వకు ఆ ప్రాజెక్టు నిలిచే పరిస్థితి లేదని.. ఇప్పుడు డయా ఫ్రం వాల్ నిర్మాణానికి 990కోట్లు కేంద్రం ఇస్తుందన్నారు. ఏపీ అభివృద్ధి కోసం బీజేపీ వేల కోట్ల నిధులు కేటాయించిందన్నారు. కూటమి ప్రభుత్వం సారధ్యంలో అమరావతి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చెందడం ఖాయమని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయడమే బీజేపీ విధానమన్నారు. ప్రధాని మోడీ సారధ్యంలో దేశ ప్రజల సంతోషంగా ఉన్నారన్నారు. 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్, వక్ఫ్ బోర్డుకు మార్పులు చేర్పులు వంటి అంశాలను ధైర్యంగా మోడీ అమలు చేశారని పురందేశ్వరి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Virat Kohli: స్వదేశానికి వచ్చేసిన విరాట్.. మరో రికార్డుకు చేరువలో కోహ్లీ
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్.. ఆప్ నేతల్లో వెల్లివిరిసిన ఆనందం
Read Latest AP News And Telugu News