Home » Purandeswari
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై వైసీపీ బ్యాచ్ మరో కుట్ర చేసింది. రాష్ట్రంలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి వెల్లడించినట్లు వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
అనపర్తి టికెట్ విషయంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(Purandeswari)తో చర్చించినట్లు అనపర్తి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (Nallimilli Rama Krishna Reddy) తెలిపారు. శనివారం నాడు దగ్గుబాటి పురందేశ్వరి - వెంకటేశ్వరరావు దంపతులతో సమావేశం అయినట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రజలందరూ మార్పును ఆకాంక్షిస్తున్నారని.. మే 13న జరిగే ఎన్నికలతో ఆ మార్పు వస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరికీ ప్రజలు ఓటు వేసి గెలిపించాలన్నారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని సీఈవో ఎంకే మీనాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి లేఖ రాశారు. రాజకీయ పార్టీలు విమర్శలు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాలని ఎన్నికల పరివర్తనా నియమావళి చెబుతోందన్నారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నిప్పులు చెరిగారు. ఆదివారం విజయవాడలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ - తెలుగుదేశం - జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని బీజేపీ చీఫ్, రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari) అన్నారు. ఏప్రిల్ 4 వ తేదిన ఉమ్మడి పార్టీల పార్లమెంట్ సమన్వయ సమావేశం జరుగుతుందని తెలిపారు.
Daggubati Purandeswari: రాజీలేని రాజకీయ చాతుర్యం.. వాగ్దాటిలోని గాంభీర్యం.. వ్యవహారంలో చాణక్యం.. అందరినీ కలుపుకొనిపోయే మనస్తత్వం.. అన్నింటికీ మించి తెలుగువారి కీర్తిని దశ దిశలా చాటిన మహానుభావుడు ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి.. ‘తూర్పు’ ఆడబడుచుగా సార్వత్రిక ఎన్నికల్లో రాజమహేంద్రవరం పార్లమెంట్ బరిలో బీజేపీ తరపున అడుగుపెట్టారు...
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలుగుదేశం - జనసేన కూటమి నేతలతో కలిసి సమన్వయంతో ముందుకెళ్తామని బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి(Purandeswari) అన్నారు. పొత్తుల్లో భాగంగా తమకొచ్చిన సీట్లల్లో అభ్యర్థులను ఖరారు చేశామని చెప్పారు.
అవినీతి, అరాచక జగన్ ప్రభుత్వాన్ని గద్దెం దింపేందుకే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని బీజేపీ (BJP) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి ఫురందేశ్వరి తెలిపారు. విజయవాడలో బీజేపీ పదాదికారుల సమావేశం జరిగింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari)ని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ(Manda Krishna Madiga) మర్యాద పూర్వకంగా కలిశారు. సోమవారం నాడు బీజేపీ కార్యాలయంలో రెండు గంటల పాటు చర్చలు జరిపారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు.