Purandeswari: ఏపీలో కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలి
ABN , Publish Date - Mar 28 , 2024 | 10:48 PM
ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ - తెలుగుదేశం - జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని బీజేపీ చీఫ్, రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari) అన్నారు. ఏప్రిల్ 4 వ తేదిన ఉమ్మడి పార్టీల పార్లమెంట్ సమన్వయ సమావేశం జరుగుతుందని తెలిపారు.
రాజమండ్రి: ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ - తెలుగుదేశం - జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని బీజేపీ చీఫ్, రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari) అన్నారు. ఏప్రిల్ 4 వ తేదిన ఉమ్మడి పార్టీల పార్లమెంట్ సమన్వయ సమావేశం జరుగుతుందని తెలిపారు. 8వ తేదీన అసెంబ్లీ సమన్వయ సమావేశం జరుగుతుందని చెప్పారు. ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రజలు కూటమిని కోరుకుంటున్నారని.. పొత్తుల్లో ఇబ్బందులను సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించుకుంటామని తెలిపారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. వైసీపీ పాలనలో ఎనిమిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచారన్నారు. ఇసుక మాపియాతో నిర్మాణం రంగం కుదేలైందని చెప్పారు. మద్యం మాపియా వల్ల చీప్ లిక్కర్‌తో పేదవాళ్లు చనిపోతున్నారని అన్నారు. దిశ యాప్ వల్ల మహిళలకు న్యాయం జరగలేదన్నారు. దళిత డ్రైవర్‌ను హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుకు ముఖ్యమంత్రి జగన్ సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు. అనపర్తి చాలా కష్టమైన నియోజకవర్గమైనప్పటికి విజయం సాధించాలని దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి