AP Elections: పొత్తులు పెట్టుకున్నది అందుకే.. ఫురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు..!
ABN , Publish Date - Mar 26 , 2024 | 12:59 PM
అవినీతి, అరాచక జగన్ ప్రభుత్వాన్ని గద్దెం దింపేందుకే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని బీజేపీ (BJP) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి ఫురందేశ్వరి తెలిపారు. విజయవాడలో బీజేపీ పదాదికారుల సమావేశం జరిగింది.
అవినీతి, అరాచక జగన్ ప్రభుత్వాన్ని గద్దెం దింపేందుకే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని బీజేపీ (BJP) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి ఫురందేశ్వరి తెలిపారు. విజయవాడలో బీజేపీ పదాదికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ సహా సంఘటన ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జి అరుణ్ సింగ్, ఇన్‌ఛార్జి సిద్ధార్ధనాధ్ సింగ్ పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఫురందేశ్వరి (Purandeswari) దిశానిర్ధేశం చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్లాలని జాతీయ స్థాయిలో పార్టీ తీసుకున్న నిర్ణయమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మూడు పార్టీల కలయిక చారిత్రాత్మక అవసరమని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తును ఆమె త్రివేణి సంగమంతో పోల్చారు. పొత్తుల వల్ల పార్టీలో చాలా మంది ఆశావహులకు నిరాశ ఎదురైంది. కానీ రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పొత్తులతో వెళ్లాలని పార్టీ హైకమాండ్ భావించిందన్నారు.
ఆధారాలు మాయం చేసేందుకు జగన్ మాఫియా కుట్ర
వైసీపీపై ఫైర్..
వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను తమ చేతుల్లోకి తీసుకుందని ఫురందేశ్వరి ఆరోపించారు. ఓటర్ల జాబితాలో భారీ ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేయించారని తెలిపారు. మరోవైపు రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం భారీ ఎత్తున అప్పులు చేసిందన్నారు. రాష్ట్ర సచివాలయంతో సహా గనులను, ప్రభుత్వ భవనాలను, భూములను ప్రభుత్వం తనఖా పెట్టిందన్నారు. సచివాలయాన్ని తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో ఏమైనా రాశారా అని ఓ వైసీపీ నేత చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టే అధికారం ఈ ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. మహిళల పుస్తెలు తెగినా నాసిరకం మద్యం తాగిస్తామనే రీతిలోనే జగన్ వ్యవహరిస్తున్నారని ఫురందేశ్వరి ఆరోపించారు.
జగన్ చేసిందేమిటి?
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలనే సీఎం జగన్.. ఆ వర్గాలకు ఏం న్యాయం చేశారని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నిధులు దారి మళ్లించారన్నారు. ఎస్సీ యువకుడిని హత్య చేసిన ఎమ్మెల్సీని సీఎం తన పక్కన కూర్చొబెట్టుకుంటున్నారని.. ఇది హేయమైన చర్య అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ అంకితమై పని చేస్తుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులనే కాదని, కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు. మూడు పార్టీల జెండాలు వేరైనా అజెండా మాత్రం ఒకటేనని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఏపీలో రామరాజ్యం వస్తుందని ఫురందేశ్వరి తెలిపారు.
TDP: కుప్పం నియోజకవర్గంలో రెండోరోజు చంద్రబాబు పర్యటన..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..