Purandeswari: ఆ విషయంలో హై కమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం
ABN , Publish Date - Mar 26 , 2024 | 10:08 PM
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలుగుదేశం - జనసేన కూటమి నేతలతో కలిసి సమన్వయంతో ముందుకెళ్తామని బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి(Purandeswari) అన్నారు. పొత్తుల్లో భాగంగా తమకొచ్చిన సీట్లల్లో అభ్యర్థులను ఖరారు చేశామని చెప్పారు.
విజయవాడ: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలుగుదేశం - జనసేన కూటమి నేతలతో కలిసి సమన్వయంతో ముందుకెళ్తామని బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి(Purandeswari) అన్నారు. పొత్తుల్లో భాగంగా తమకొచ్చిన సీట్లల్లో అభ్యర్థులను ఖరారు చేశామని చెప్పారు. పొత్తుల్లో భాగంగా విశాఖ సీటు బీజేపీకి రాలేదన్నారు. ఎంపీ అభ్యర్థుల్లో ఒక్కరిని తప్పించి మిగిలిన వారందరికీ పార్టీలో ఉన్న వారికే టికెట్లు ఇచ్చామని తెలిపారు.
గెలుపే లక్ష్యంగా తాము పని చేస్తున్న క్రమంలో తిరుపతి జిల్లాలో ఉన్న పరిస్థితుల ప్రకారం కేంద్ర బీజేపీ హై కమాండ్ నిర్ణయం తీసుకుందని వివరించారు. కార్యకర్తలను కాదని తాము నిర్ణయాలు తీసుకోమని అన్నారు. తమ పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణతో ఉంటారని.. పార్టీ నిర్ణయం తీసుకున్నాక కట్టుబడి ఉంటారని చెప్పారు. పస లేని ఆరోపణలకు సమాధానం ఇవ్వబోనని అన్నారు. ఎన్నికలకు ఏ విధంగా వెళ్లాలనే అంశంపై చర్చించామని తెలిపారు. ఎన్డీఏ పార్టీల మధ్య సమన్వయం కోసం కమిటీలు వేసుకుంటామని పురందేశ్వరి తెలిపారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి