Home » Purandeswari
రాబోయే ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించుకోవడానికి వైసీపీ కుట్ర పన్నుతోందని బీజేపీ (BJP) ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి (Purandeswari) అన్నారు. శనివారం నాడు బీజేపీ కార్యాలయంలో పురందేశ్వరి మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనకు ప్రతి ఒక్కరూ బీజేపీ పట్ల ఆకర్షితులవుతున్నారని చెప్పారు. ఇతర పార్టీలో సమర్ధవంతంగా పనిచేసిన వారు తమ పార్టీకి ఆకర్షితులై చేరుతున్నారని అన్నారు.
AP Politics 2024: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఎన్నికల నోటిఫికేషన్‌కు చిత్రవిచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టికెట్లు దక్కని.. అసంతృప్తు నేతలు, ఆశావహులు జంపింగ్‌లు చేసే పనిలో నిమగ్నమయ్యారు. మరీ ముఖ్యంగా అధికార వైసీపీలో సిట్టింగులకు టికెట్లు రాకపోవడంతో అటు టీడీపీ.. ఇటు జనసేన కండువాలు కప్పేసుకుంటున్నారు. ఇప్పుడుంతా జంపింగ్‌లే జరుగుతున్నాయి..
Andhrapradesh: భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చూడాలన్నదే ప్రధాని మోదీ కల అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ఏపీలో రూ.29,395 కోట్లతో నిర్మించిన 1134 కిలో మీటర్ల నేషనల్ హైవేలను వర్చువల్ ద్వారా ప్రధాని మోదీ సోమవారం నాడు ప్రారంభించారు. ఇందులో భాగంగా విజయవాడలో జరిగిన రాష్ట్ర పార్టీ చీఫ్ పురంధేశ్వరి, సత్యకుమార్, సీఎం రమేష్ పాల్గొన్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పార్టీ ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మేనిఫెస్టో రూపకల్పన కోసం అభిప్రాయ సేకరణ చేపట్టనున్నామని వెల్లడించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏం ఆశిస్తున్నారనే అంశంపై రెండు బాక్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తొమ్మిది జిల్లాలకు మేనిఫెస్టో రథాలను పంపనున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఇక పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. టీడీపీ - జనసేన పార్టీలతో పొత్తు ఖరారవ్వడం సంతోషమని వ్యాఖ్యానించారు.
రాబోయే ఎన్నికల్లో బీజేపీ(BJP) ఘన విజయం సాధిస్తుందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari) అన్నారు. మంగళవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో కూడా బీజేపీని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. భస్మాసురుడు తనతలపై చేయి పెట్టుకున్నట్లు 2019లో రాష్ట్ర ప్రజలు సీఎం జగన్‌ను నెత్తిన పెట్టుకున్నారని చెప్పారు.
బీజేపీ మేనిఫెస్టో కమిటీ సభ్యులతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దగ్గుబాటి పురందేశ్వరి భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికలలో వ్యూహాలపై చర్చించనున్నారు. నిన్న, మొన్న శివప్రకాష్ జీ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు కొనసాగుతోంది.
టీడీపీ - జనసేనతో పొత్తుపై తమ హై కమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeswari ) తెలిపారు. రెండు రోజుల పాటు బీజేపీ కీలక సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాలు నేటితో ముగిశాయి. జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివ ప్రకాష్ వరుస సమావేశాల్లో పార్టీ ముఖ్య నేతలు, జిల్లాల్లోని నేతలతో పలు కీలక అంశాలపై చర్చించారు.
విజయవాడ: రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆధ్వర్యంలో పలువురు కృష్ణా జిల్లా నేతలు, కార్యకర్తలు పార్టీలో చేరారు. వారికి ఆమె బీజేపీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
BJP First MP Candidates List: హ్యాట్రిక్ కొట్టాల్సిందేనని.. బీజేపీ (BJP) పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. కాంగ్రెస్ తమతో కలిసొచ్చే పార్టీలను కలుపుకోని పోయే పనిలో ఉంటే.. బీజేపీ మాత్రం అందరి కంటే ముందుగానే కూటమి ఏర్పాటు చేసేయడం.. అభ్యర్థులను కూడా ప్రకటించేసే పనిలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మోదీ మూడోసారి ప్రధాని కావాల్సిందేనని బీజేపీ పెద్దలు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. చిన్నపాటి అవకాశం వచ్చినా సరే.. సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకెళ్తున్నారు..
విజయవాడ: టిడ్కో ఇళ్ళు కూడా ఇవ్వలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని.. గత ప్రభుత్వం, ప్రస్తుత సర్కార్ ఒక్కో లబ్దిదారుల దగ్గర నుంచి 25 వేల నుంచి లక్ష రూపాయలు వసూలు చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు.