Share News

Purandeswari: ప్రచార షెడ్యూల్‌పై ముఖ్య నేతలతో పురందేశ్వరి సమావేశం..

ABN , Publish Date - Mar 25 , 2024 | 11:45 AM

బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేరుకున్నారు. ప్రచార షెడ్యూల్‌పై ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. నిన్న ఆరు పార్లమెంటు స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. నేడో, రేపో పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. బీజేపీ సభలకు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు రానున్నారు.

Purandeswari: ప్రచార షెడ్యూల్‌పై ముఖ్య నేతలతో పురందేశ్వరి సమావేశం..

విజయవాడ: బీజేపీ (BJP) రాష్ట్ర కార్యాలయానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari) చేరుకున్నారు. ప్రచార షెడ్యూల్‌పై ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. నిన్న ఆరు పార్లమెంటు స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. నేడో, రేపో పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. బీజేపీ సభలకు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు రానున్నారు. వచ్చే నెల ఐదు నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. రాజమండ్రి నుంచి దగ్గుబాటి పురందేశ్వరి ప్రచారం‌ ప్రారంభించనున్నారు.

AP Elections: రఘురామను కాదని శ్రీనివాసవర్మకు టికెట్.. ఇంతకీ ఎవరీయన..!?

టీడీపీ (TDP), జనసేన (Janasena)తో పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో పోటీ చేస్తున్న 10 అసెంబ్లీ, ఆరు లోక్‌సభ సీట్లకు అభ్యర్థుల ఎంపికపై బీజేపీ ఓ స్పష్టతకు వచ్చినట్టు తెలిసింది. శనివారం ఢిల్లీలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, సోము వీర్రాజు... ఆ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్‌చార్జులు అరుణ్‌ సింగ్‌, సిద్ధార్థ నాథ్‌తో భేటీ అయ్యారు. పొత్తు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చించారు. ఏపీలో 10 అసెంబ్లీ, ఆరు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను హైకమాండ్‌కు అందించినట్టు తెలిసింది. తిరుపతి, అనకాపల్లి, అరకు, రాజమండ్రి, నరసాపురం, విజయనగరం లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలిసింది. బీజేపీ ప్రకటించే ఐదో జాబితాలో ఏపీ నుంచి ఆరుగురు లోక్‌సభ అభ్యర్థుల పేర్లు ఉండే అవకాశముంది.

AP News: అమరావతి ఉద్యమానికి తాత్కాలిక విరామం..

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ - తెలుగుదేశం- జనసేన కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు, ఆరు లోక్‌సభ స్థానాలను కేటాయించింది. ఈ క్రమంలో తెలుగుదేశం, జనసేన వరుసగా అభ్యర్థులను ఖరారు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బీజేపీ ఆదివారం 5వ విడత జాబితాలో ఆరు పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది .10 అసెంబ్లీ స్థానాలకు రేపు (సోమవారం) ప్రకటించే అవకాశం ఉంది. కాగా మొత్తం 111 మంది అభ్యర్థులతో ఐదో జాబితాను విడుదల చేయగా తెలంగాణ నుంచి ఇద్దరిని బీజేపీ ఖరారు చేసింది.

బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే..

రాజమండ్రి...పురందేశ్వరి

రాజంపేట....నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి

అరకు.....కొత్తపల్లి గీత

తిరుపతి....వర ప్రసాద్

నరసాపురం....శ్రీనివాసవర్మ

అనకాపల్లి.....సీఎం రమేశ్‌

TDP: చంద్రబాబు కుప్పంలో నేటి నుంచి రెండు రోజుల పర్యటన

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 25 , 2024 | 11:45 AM