Home » Raghav Chadha
ప్రపంచంలో యువకులు అత్యధికంగా ఉన్నది భారత్‌లోనే. మరి వయస్సు పైబడిన వారు ఎక్కువగా ఉన్నది ఏ రంగంలో అంటే టక్కున గుర్తొచ్చేది రాజకీయాలే. ఇదే అంశాన్ని లేవనెత్తారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha) .
రాఘవ్ చద్దాను రాజ్యసభలో పార్టీ నేతగా (ఫ్లోర్ లీడర్) ఆమ్ ఆద్మీ పార్టీ నియమించింది. సంజయ్ సింగ్ స్థానంలో రాఘవ్ చద్దాను నియమిస్తున్నట్టు ఆప్ నాయకత్వం రాజ్యసభ చైర్మన్‌కు ఒక లేఖలో తెలియజేసింది. లిక్కర్ పాలసీ కేసులో ప్రస్తుతం సంజయ్ కింగ్ జైలులో ఉన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాపై పడిన సస్పెన్షన్ వేటును రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖఢ్ సోమవారంనాడు రద్దు చేశారు. ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఒక తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను లక్ష్యంగా చేసుకుని బీజేపీ చేస్తున్న సోషల్ మీడియా పోస్టులపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్నెర్ర చేసింది. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. సీపీం పరువుకు భంగం కలిగించేలా పోస్టులు పెడుతున్నారంటూ ఈసీ దృష్టికి తెచ్చింది.
రాజ్యసభ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాకు సుప్రీంకోర్టు (Supreme court) శుక్రవారంనాడు ఆదేశాలిచ్చింది. ఆయన తన సస్పెన్షన్‌పై నేరుగా రాజ్యసభ చైర్‌పర్సన్‌ను కలిసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా బీజేపీపై సంచలన అరోపణలు చేశారు. 2024 ఎన్నికలకు ముందే 'ఇండియా' కూటమి నేతల అరెస్టును బీజేపీ టార్గెట్‌గా పెట్టుకుందని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో దీనిని మొదలుపెట్టనుందని అన్నారు.
ప్రభుత్వ బంగ్లా విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన అధికారిక బంగ్లా ఖాళీ చేయాల్సిన అవసరం లేదని ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. క్రింది కోర్టు ఆదేశాలను తోసిపుచ్చింది. దీనిపై రాఘవ్ చద్దా ఒక ట్వీట్‌లో తన స్పందన తెలిపారు. ఈ పోరాటం ఒక ఇంటి కోసమో, దుకాణం కోసమే కాదని, రాజ్యాంగాన్ని రక్షించేందుకని ట్వీట్ చేశారు.
రాజ్యసభ నుంచి తనను సస్పెండ్ చేయడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా సుప్రీంకోర్టులో మంగళవారంనాడు సవాలు చేశారు. సభా హక్కుల ఉల్లంఘన కింద రాఘవ్ చద్దాపై నలుగురు ఎంపీలు ఫిర్యాదు చేయడంతో ఆగస్టు 11న ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాకు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. ఆయనకు కేటాయించిన ప్రభుత్వ బంగ్లాను రద్దు చేసినందున ఆయనకు అందులో కొనసాగే హక్కు లేదని కోర్టు తీర్పునిచ్చింది. చద్దాకు ఇంతకు ముందు ఇచ్చిన తాత్కాలిక స్టేను కోర్టు ఎత్తివేసింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌ను ఈడీ అరెస్టు చేయడంపై ఆప్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీపై విరుచుకుపడ్డాయి. పదిహేను నెలలుగా ఈడీ, సీబీలను ఉసిగొలపడం, అరెస్టులు చేయడం రివాజుగా మారినట్టు ఆరోపించాయి.