Share News

Raghav chadha Suspension: బేషరతు క్షమాపణ చెప్పాలని చద్దాకు సుప్రీంకోర్టు ఆదేశం

ABN , First Publish Date - 2023-11-03T15:27:32+05:30 IST

రాజ్యసభ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాకు సుప్రీంకోర్టు (Supreme court) శుక్రవారంనాడు ఆదేశాలిచ్చింది. ఆయన తన సస్పెన్షన్‌పై నేరుగా రాజ్యసభ చైర్‌పర్సన్‌ను కలిసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

Raghav chadha Suspension: బేషరతు క్షమాపణ చెప్పాలని చద్దాకు సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: రాజ్యసభ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha)కు సుప్రీంకోర్టు (Supreme court) శుక్రవారంనాడు ఆదేశాలిచ్చింది. ఆయన తన సస్పెన్షన్‌పై నేరుగా రాజ్యసభ చైర్‌పర్సన్‌ను కలిసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.


దేశ రాజధాని ఢిల్లీ (సవరణ) బిల్లు-2023పై ప్రతిపాదిత సెలక్ట్ కమిటీకి అనుమతి తీసుకోకుండానే కొందరు సభ్యుల పేర్లను చేర్చారంటూ గత వర్షాకాల సమావేశాల్లో రాఘవ్ చద్దాను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. రాఘవ్ చద్దాను సస్పెండ్ చేయాలంటూ పీయూష్ గోయెల్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. నిబంధనల ఉల్లంఘన, అనుచిత ప్రవర్తన, ధిక్కార ఆరోపణలపై ఆయనపై సస్పెన్స్ వేటు పడింది. దీనిపై సభా హక్కుల కమిటీ విచారణ జరిపి నివేదిక ఇచ్చేంత వరకూ సస్పెన్షన్ కొనసాగుతుందని రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. దీనిపై రాఘవ్ చద్దా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


కాగా, సభా గౌరవాన్ని కించపరచే ఉద్దేశం తన క్లయింటుకు లేదని, ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పేందుకు రాజ్యసభ చైర్‌పర్సన్‌ ఆపాయింట్‌మెంట్ కోరుతారని చద్దా తరఫు న్యాయవాది ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను సుప్రీంకోర్టు రికార్డు చేసింది. సభలోని వాస్తవాలు, పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రాఘవ్ చద్దా క్షమాపణను సానుభూతితో పరిశీలించవచ్చని రాజ్యసభ చైర్‌పర్సన్‌కు కోర్టు సూచించింది. దీపావళి తర్వాత ఎంపీ పిటిషన్‌ను పరిశీలిస్తామని, ఇందుకు సంబంధించిన డెవలప్మెంట్‌ తమకు తెలియజేయాలని అటార్నీ జనరల్‌ను ఆదేశించింది.

Updated Date - 2023-11-03T15:27:33+05:30 IST