Home » Raghunandan Rao
తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్‌ను బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు (Raghunandan Rao) శుక్రవారం కలిశారు. లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని డిస్క్వాలిఫై చేయాలని సీఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ ఎన్నికల్లో ఒక్కో ఓటర్‌కు ఆయన రూ. 500లు పంపిణీ చేశారని ఆరోపించారు.
మెదక్ పార్లమెంటు నియోజకవర్గం సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఆ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ కలెక్టర్ వెంకట్రామారెడ్డి బరిలోకి దిగారు.
బీజేపీ (BJP) పదేళ్లు దేశంలో అధికారంలో ఉండి తెలంగాణకు ఏం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించని బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో ఎందుకు ఓట్లు వేయాలని నిలదీశారు. నర్సాపూర్‌లో గురువారం కాంగ్రెస్ జనజాతర సభ జరిగింది. ఈ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. దుబ్బాక ప్రజలకు బీజేపీ అభ్యర్థి (రఘునందన్‌రావు) ఏం చేయలేదని మండిపడ్డారు.
Telangana: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నయా నాటకాలకు తెర లేపుతున్నారని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... రఘు నందన్ రావు దుబ్బాకలో ఓడిపోతే కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోలేదా అని అన్నారు. పోలీసులతో డబ్బులు పంచి గెలిచినందుకు కేసీఆర్‌కు సిగ్గు ఉండాలంటూ వ్యాఖ్యలు చేశారు. వెంకట్ రాంరెడ్డి ఎన్ని కట్టలు కట్టించినందుకు మెదక్ సీటు ఇచ్చావ్ కేసీఆర్ అని నిలదీశారు.
సంగారెడ్డి జిల్లా: ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మంగళవారం సంగారెడ్డిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రఘునందన్‌రావు మాట్లాడుతూ..
లోక్‌సభ ఎన్నికల్లో ఓటుతో కాంగ్రెస్, బీజేపీకి మెదక్ ప్రజలు గుణపాఠం చెబుతారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు (Harish Rao) అన్నారు. నర్సాపూర్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హరీశ్‌రావు, మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
45 ఏళ్లుగా మామ(కేసీఆర్), అల్లుడు(హరీశ్‌రావు) శనిలాగా, పాపాల బైరవుల్లా ఉమ్మడి మెదక్ ప్రజలను పీక్కుతుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు.
Telangana: ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఏకిపారేస్తున్నారు. గురువారం కుక్నూర్ పల్లి మండల కేంద్రంలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రఘునందన్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితతో పాటు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మొన్న సిద్దిపేటలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) మాట్లాడిన మాటలను కాంగ్రెస్ నేతలు మార్పింగ్ చేశారని మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు (Raghunandan Rao) అన్నారు. గజ్వేల్ పట్టణంలో బుధవారం ఓ ఫంక్షన్ హల్లో బీజేపీ ఓబీసీ సామజిక సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి రఘునందన్ రావు, బీజేపీ కీలక నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
Telangana: బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాక ఎన్నికల సమయంలో కూడా ఫేక్ న్యూస్ ప్రచారం చేశారని మండిపడ్డారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోనీ 35,36 వార్డులలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్ రామ్ రెడ్డి పాల్గొన్నారు.