Home » Raghunandan Rao
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట రామిరెడ్డి (Venkatarami Reddy) అన్నారు. ఆదివారం నాడు వర్గల్ మండలం గౌరారంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ (BRS) కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వెంకటరామిరెడ్డి, మెదక్ ఎమ్మెల్సీ వంటేరు యాదవ రెడ్డి , మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏనాడైనా జై తెలంగాణ అన్నారా అని ప్రశ్నించారు. ఎన్నికల హామీలపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ (BRS) పూర్తిగా మునిగిపోవడం ఖాయమని మెదక్ బీజేపీ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్ రావు (Raghunandan Rao) అన్నారు. గురువారం నాడు మెదక్ పట్టణంలోని చిల్డ్రన్ పార్క్‌లో బీజేపీ మెదక్ పార్లమెంటు నియోజక వర్గం బూత్ అధ్యక్షుల సమ్మేళనం నిర్వహించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) గర్వం వల్లనే నేడు ఆ పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారని.. ఆ పార్టీలో ఇక ఎవరు ఉండరని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘు నందన్ రావు (Raghunandan Rao) అన్నారు.
Telangana: పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్కు స్థానిక అభ్యర్థి దొరకకపోవడం బాధాకరమని బీజేపీ మెదక్ పార్లమెంటరీ అభ్యర్థి రఘునందన్ రావు వ్యాఖ్యలు చేశారు. శనివారం జిల్లాలోని మర్కుక్ మండల కేంద్రంలో రంగనాయక స్వామి ఆలయంలో రఘునందన్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆపై బీజేపీ బూత్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, హరీష్‌రావులకు తెలంగాణలో మెదక్ పార్లమెంటు అభ్యర్థికి పోటీ చేయడానికి ఒక్కరు కూడా దొరకలేదా అని ప్రశ్నించారు.
సొంత అవసరాల కోసం కొంతమంది నేతలు పార్టీలు మారుతున్నారని బీజేపీ సీనియర్ నేత రఘునందనరావు (Raghunandan Rao) అన్నారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కొడుకుకు టికెట్ ఇస్తే బీజేపీలో ఉండేవారని...టికెట్ ఇవ్వకపోతే పార్టీ మంచిది కాదా అని ప్రశ్నించారు.
కమలం పార్టీ తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరదీసింది. పెండింగ్ పార్లమెంట్ స్థానాలపై బీజేపీ కసరత్తు నిర్వహిస్తోంది. 17కు గాను.. 9పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. బలహీనంగా ఉన్న చోట చేరికలను కమలం పార్టీ ప్రోత్సహిస్తోంది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం వేట కొసాగిస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి బీజేపీకి, బీఆర్ఎస్ పొత్తు అని తనకెలా తెలుసునని బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు(Raghunandan Rao) ప్రశ్నించారు. ‘భారత్ వికసిత సంకల్ప యాత్ర’లో రఘునందన్ రావు, గోదావరి అంజిరెడ్డి, పులిమమిడి రాజు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Telangana: పాలకుల చిత్తశుద్ధి లోపంతోనే ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం పఠాన్ చెరు ఏలాంటి అభివృద్ధి చెందలేదని మాజీ ఎమ్మెల్యే రఘుందన్ రావు విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఈదుల నాగులపల్లిలో రైల్వే టెర్మినల్ భూసేకరణ వద్దే ఆగిపోవటం విచారకరమన్నారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత అల్లుడు తూర్పుకు, కొడుకు పడమరకు పోతారని.. ఇక బీఆర్ఎస్ ఫాంహౌస్‌కు పరిమితం అయిందని బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు(Raghunandan Rao) అన్నారు.