Home » Raghurama krishnam raju
లోక్‌సభలో పంచాయతీ నిధుల మళ్లింపుపై జగన్ ప్రభుత్వాన్ని ( YCP GOVT ) వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణమ రాజు ( MP Raghurama Krishnaraju ) ప్రశ్నించారు. రఘురామ ఏమన్నారంటే... ‘‘ఏపీలో గ్రామస్వరాజ్యానికి జగన్ ప్రభుత్వం తూట్లు పొడిచింది. లోక్‌సభలో జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.569కోట్లలో ఒక్క పైసా కూడా పంచాయతీలకు వెళ్లలేదని ఎంపీ రఘురామ అన్నారు.
వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ( Chevireddy Bhaskar Reddy ) ప్రగతి భవన్లో కూర్చొని సర్వే చేసి బీఆర్ఎస్ ( BRS ) పార్టీని ఈ ఎన్నికల్లో ఎలా గెలిపించాలనే దానిపై చర్చించలేదా, బీఆర్ఎస్ గెలుపు కోసం ఆయన పని చేయలేదా అని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ( MP Raghurama Krishnaraju ) ప్రశ్నించారు.
ఏపీ సీఎం జగన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వేరే రాష్ట్రానికి జగన్ కేసును బదిలీ చేయాలన్న కేసుతో పాటు బెయిల్ రద్దు పిటిషన్‌నూ విచారించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది.
వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అవినీతిపై సీబీఐ దర్యాప్తు జరపాలని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపు వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి తదుపరి విచారణ డిసెంబర్ 14కు వాయిదా వేశారు.
న్యూఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ రావడంతో వైసీపీ అగ్రనేతలు తట్టుకోలేకపోతున్నారు.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాటల కంటే సాక్షిలో ఈరోజు రాసిన రాతలు రోతగా ఉన్నాయని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ధిక కుంభకోణాలపై పిటిషన్ దాఖలు చేశానని.. వేరే ధర్మాసనం ముందు త్వరలో విచారణకు రానుందని, వాలంటీర్లను అడ్డుపెట్టుకొని అన్ని కార్యక్రమాలు చేస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శించారు.
రాష్ట్రంలో ఆర్థిక కుంభకోణాలపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిల్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు సుప్రంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్రమాస్తుల కేసులో జగన్‌కు సుప్రీం నోటీసులు జారీ చేసింది. జగన్‌తో పాటు సీబీఐకి కూడా ఉన్నతన్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. జగన్ కేసులకు సంబంధించి దాఖలైన పిటీషన్‌పై ఈరోజు (శుక్రవారం) సుప్రీంలో విచారణ జరిగింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది.
తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్‌కు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఎంపీ రఘురామకృష్ణ రాజు లేఖ రాశారు.
న్యూఢిల్లీ: ఫైబర్ నెట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిటిషన్ విచారణకు వచ్చిందని, అయితే కేసు విచారణ వాయిదా పడిందని.. ఇది జగన్ వ్యక్తిగత కక్ష మాత్రమేనని.. కేసులో ఏమి లేదని ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు.