Raghurama Krishnaraju: ఏ పార్టీ సభ్యత్వం తీసుకున్నా.. మరుక్షణమే నా ఎంపీ సీటు పోతుంది
ABN , Publish Date - Apr 05 , 2024 | 10:36 AM
తనను శాశ్వతంగా నియోజకవర్గం నుంచి దూరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. భీమవరంలోని కూటమి క్షత్రియ ఆత్మీయ సమ్మేళనంలో రఘురామ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ పార్టీ సభ్యత్వం తీసుకున్నా ఆ మరుక్షణమే తన ఎంపీ సీటు పోతుందన్నారు. మాట్లాడించుకున్నన్ని రోజులు మాట్లాడించుని.. ఇప్పుడు సభ్యత్వం లేదంటున్నారని రఘురామ వాపోయారు.
భీమవరం: తనను శాశ్వతంగా నియోజకవర్గం నుంచి దూరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఎంపీ రఘురామ కృష్ణరాజు (Raghu Rama Krishna Raju) పేర్కొన్నారు. భీమవరంలోని కూటమి క్షత్రియ ఆత్మీయ సమ్మేళనంలో రఘురామ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ పార్టీ సభ్యత్వం తీసుకున్నా ఆ మరుక్షణమే తన ఎంపీ సీటు పోతుందన్నారు. మాట్లాడించుకున్నన్ని రోజులు మాట్లాడించుని.. ఇప్పుడు సభ్యత్వం లేదంటున్నారని రఘురామ వాపోయారు. కూటమి నెగ్గాలనుకున్నానని.. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాననన్నారు. తనకు వారు న్యాయం చేస్తారని విశ్వాసముందన్నారు. ఒకవేళ టికెట్ తెచ్చుకోగలిగితే తనను కూడా అఖండ మెజార్టీతో గెలిపించాలని రఘురామ కోరారు.
Janasena-YCP: జనసేన అభ్యర్థికి వైసీపీ నేతల బెదిరింపులు
నరసాపురం సిటింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈసారి టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. మంగళవారం రాత్రి ఆయన హైదరాబాద్‌లో చంద్రబాబుతో (Chandrababu) భేటీ సందర్భంగా ఈ నిర్ణ యం జరిగినట్లు సమాచారం. శుక్రవారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అదే జిల్లా ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. వాస్తవానికి ఆయన్ను నరసాపురం లోక్‌సభ అభ్యర్థిగా నిలపాలని టీడీపీ అధినేత గట్టి ప్రయత్నమే చేశారు. అయితే ఆ సీటు పొత్తులో బీజేపీకి వెళ్లింది. తమ అభ్యర్థిగా శ్రీనివాస వర్మ పేరును ప్రకటించింది. ఆయన్ను మార్చేందుకు సుముఖత చూపలేదని సమాచారం. దీంతో అసెంబ్లీ బరిలో రఘురామరాజును నిలపాలని నిశ్చయించినట్లు చెబుతున్నారు. కాగా.. రఘురామ గురువారం భీమవరం రానున్నారు.
AP Elections: దోచేయడానికి సిద్ధమా.. ప్రజల ప్రశ్నలతో వైసీపీ ఉక్కిరి బిక్కిరి..!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..