Share News

Raghu Rama: రెండు, మూడు రోజుల్లో శుభవార్త వింటారు

ABN , Publish Date - Apr 03 , 2024 | 07:35 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణం రాజు(Raghu Rama Krishna Raju) స్పష్టం చేశారు. బుధవారం నాడు విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి పంచహారతుల కార్యక్రమంలో పాల్గొన్నారు.

Raghu Rama: రెండు, మూడు రోజుల్లో శుభవార్త వింటారు

కృష్ణా(విజయవాడ): ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణం రాజు (Raghu Rama Krishna Raju) స్పష్టం చేశారు. బుధవారం నాడు విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి పంచహారతుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ.. అమ్మవారి దర్శనం కోసం విజయవాడ వచ్చానని తెలిపారు.

Devineni Uma: ప్రచారానికి వచ్చి టీడీపీ కార్యకర్తలపై దాడి అమానుషం


రేపు(గురువారం) తన నియోజకవర్గం వెళ్లనున్నట్లు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో తనకు మంచి వార్త వస్తుంది అనుకుంటున్నానని చెప్పారు. ఏ పార్టీ నుంచి టికెట్ వస్తుందనేది ఇంకా తెలీదని చెప్పారు. అమ్మవారికి తన సమస్యను చెప్పుకోవడానికి వచ్చానని తెలిపారు. సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వింటున్నానని చెప్పారు.. తానైతే కచ్చితంగా పోటీ చేస్తానని అన్నారు. ఒకటి రెండు రోజుల్లో కూటమి అభ్యర్థిగా తనను ప్రకటిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. టికెట్ ప్రకటించిన వెంటనే తన నియోజకవర్గంలో పర్యటిస్తానని రఘురామ కృష్ణం రాజు చెప్పారు.


ఒకటి రెండు రోజుల్లో కూటమి అభ్యర్థిగా తనను ప్రకటిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. టికెట్ ప్రకటించిన వెంటనే తన నియోజకవర్గంలో పర్యటిస్తానని చెప్పారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కచ్చితంగా గెలుస్తారని.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. పింఛన్ల విషయంలో పింఛన్‌దారులను సీఎం జగన్ తీవ్ర ఇబ్బందులకి గురి చేశారని మండిపడ్డారు. 1,50,000 మంది సెక్రటేరియట్ సభ్యులు ఉన్నారని.. ఒక్కొక్క వ్యక్తికి 50 గృహాలు అప్పగిస్తే ఒక్క రోజులో వారందరూ పెన్షన్ ఇచ్చేస్తారని చెప్పారు.

ఒక పోస్ట్ మెన్ రోజుకి ఎన్ని ఉత్తరాలు ఇస్తున్నాడో తెలుసుకోవాలన్నారు. కావాలనే పెన్షన్ దారులను ఇబ్బందులకు గురిచేసి ఆ నెపాన్ని చంద్రబాబు నాయుడు మీదకి నెట్టేసే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. ఈరోజు ఎవరైతే ఇబ్బంది పడుతూ పెన్షన్ తీసుకున్నారో వారందరి ఉసురు కచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి తగులుతుందని రఘురామ కృష్ణం రాజు అన్నారు.

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం.. తెనాలి పర్యటన రద్దు

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 03 , 2024 | 07:48 PM