Home » Rainbow
సూర్యభగవానుని కదలికల ఆధారంగా, ఉత్తరాయణం, దక్షిణాయణాలు రెండింట్లోనూ చెరో ఆరు నెలలు చొప్పున ఏడాది కాలం సాగుతుంది.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. చార్మినార్ సర్దార్ మహల్‌లో అత్యధికంగా 4.8, వారాసిగూడ బౌద్ధ నగర్‌లో 4.7 సెం.మీ వర్షం కురిసింది. రామాంతాపూర్, కాప్రా, హయత్‌నగర్, బండ్లగూడ, అంబర్‌పేట, నాచారం, హబ్సిగూడ ప్రాంతాల్లో 4 సెం.మీ.కుపైగా వాన పడింది.
గత కొద్దిరోజుల నుంచి ఎండల తీవ్రత, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. అలాంటి వారికి వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వాతావరణం చల్లగా మారుతోందని.. వర్షం కురవనుందని వెల్లడించింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడనుందని పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగ భగలు కొనసాగుతోన్నాయి. మే నెల చివరి వారంలో కూడా ఎండలు విజృంభిస్తున్నాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోహిణి కార్తె సందర్భంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో వాతావరణ చల్లని కబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో శనివారం (ఈ రోజు) నుంచి మూడు రోజులు వర్షాలు పడతాయని అధికారులు వివరించారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం వెల్లడించింది. ఈ అల్పపీడనం తొలుత వాయవ్య దిశగా కదిలి ఈనెల 24వ తేదీ నాటికి మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశముందని తెలిపింది. ఇక మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని వివరించింది.