Share News

Rain Alert: అలర్ట్.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షం

ABN , Publish Date - Jun 05 , 2024 | 03:22 PM

గత కొద్దిరోజుల నుంచి ఎండల తీవ్రత, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. అలాంటి వారికి వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వాతావరణం చల్లగా మారుతోందని.. వర్షం కురవనుందని వెల్లడించింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడనుందని పేర్కొంది.

Rain Alert: అలర్ట్.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షం
Rain Alert

గత కొద్దిరోజుల నుంచి ఎండల తీవ్రత, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. అలాంటి వారికి వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వాతావరణం చల్లగా మారుతోందని.. వర్షం (Rain) కురవనుందని వెల్లడించింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడనుందని పేర్కొంది. మరికొన్ని చోట్ల మాత్రం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది.


వర్ష ప్రభావం ఇక్కడే..!!

పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కర్ణాటకలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతం, గోవా, మహారాష్ట్ర, కోస్తాంధ్ర, తెలంగాణలో బుధవారం నాడు (ఈ రోజు) ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురువనుందని వెల్లడించింది. దక్షిణ మహారాష్ట్ర-కొంకణ్-గోవా తీరంలో 35 కిలోమీటర్ల వేగం నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, పశ్చిమ అరేబియా తీర ప్రాంతంలో 55 కిలోమీటర్ల వేగం నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


భానుడి భగభగలు

పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ తూర్పు ప్రాంతం, బీహార్, జార్ఖండ్, ఒడిశాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనుందని అధికారులు వివరించారు. రాజస్థాన్, హర్యానాలో కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజస్థాన్‌లో గల గంగానగర్, చురులో వరసగా 45.2, 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యాయి. హర్యానా సిర్సా, రోహ్ తక్‌లో 45.4, 44.4, 45.1 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యింది. ఎండల తీవ్రత నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు.

Updated Date - Jun 05 , 2024 | 03:30 PM