Home » Rajastan Royals
ఈరోజు IPL 2024 19వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ వరుస విజయాలను అడ్డుకోవాలని ఆర్సీబీ భావిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్ విజయం సాధించింది. అదే సమయంలో RCB ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం మాత్రమే సాధించింది.
ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు చెలరేగారు. ట్రెంట్ బౌల్ట్(3/22), యజుర్వేంద్ర చాహల్(3/11) నిప్పులు చెరిగే బంతులకు ముంబై బ్యాటర్ల వద్ద సమాధానమే లేకపోయింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ ముందు ముంబై ఇండియన్స్ జట్టు 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.
ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ నిప్పులు చెరిగాడు. తన పేస్ పదునుతో ఏకంగా ముగ్గురు ముంబై బ్యాటర్లను గోల్డెన్ డకౌట్ చేశాడు. అది కూడా 4 బంతుల వ్యవధిలోనే కావడం గమనార్హం.
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కాయిన్ వేయగా రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ హెడ్స్ చెప్పాడు. కాయిన్ కూడా హెడ్స్ పడింది. టాస్ గెలిచిన శాంసన్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు.
ఐపీఎల్ 2024లో సోమవారం కీలక పోరు జరగనుంది. ఐదు సార్ల ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో మొదటి సీజన్ విజేత రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.
ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ బోణీ చేసింది. లక్నోసూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 20 పరుగుల తేడాతో గెలిచింది. సంజూ శాంసన్(82) భారీ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్‌లో రాజస్థాన్ 193/4 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఐపీఎల్ 2024లో భాగంగా లక్నోసూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో శాంసన్ భారీ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 3 ఫోర్లు, 6 సిక్సులతో విధ్వంసం సృష్టించిన శాంసన్ 52 బంతుల్లో 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
కెప్టెన్ సంజూ శాంసన్(82) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో లక్నోసూపర్ జెయింట్స్ ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టు 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. వరుసగా ఐదో సీజన్లోనూ శాంసన్ తొలి మ్యాచ్‌లో 50+ స్కోర్‌తో చెలరేగాడు. 3 ఫోర్లు, 6 సిక్సులతో 52 బంతుల్లోనే 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా లక్నోసూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అద్భుత కీపింగ్ ఆకట్టుకుంటుంది. గాయం తర్వాత కోలుకుని జట్టులోకి వచ్చిన వెంటనే రాహుల్ అద్భుత కీపింగ్ నైపుణ్యం ప్రదర్శించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
లక్నోసూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో లక్నోసూపర్ జెయింట్స్ ముందుగా బౌలింగ్ చేయనుంది.