Share News

IPL 2024: వర్షం కారణంగా కోల్‌కతా-రాజస్థాన్ మ్యాచ్ రద్దయితే.. ప్లే ఆఫ్స్‌లో ఆర్సీబీతో తలపడే జట్టు ఏదో తెలుసా!

ABN , Publish Date - May 19 , 2024 | 08:56 PM

ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ ఆడనున్న నాలుగు జట్లు ఖరారయ్యాయి. శనివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 27 పరుగుల తేడాతో విజయం సాధించడంతో నాలుగవ ప్లే ఆఫ్ బెర్త్ ఖాయమైంది. కానీ 2, 3 స్థానాల్లో నిలిచే జట్లపై ఇంకా క్లారిటీ రాలేదు.

IPL 2024: వర్షం కారణంగా కోల్‌కతా-రాజస్థాన్ మ్యాచ్ రద్దయితే.. ప్లే ఆఫ్స్‌లో ఆర్సీబీతో తలపడే జట్టు ఏదో తెలుసా!

ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ ఆడనున్న నాలుగు జట్లు ఖరారయ్యాయి. శనివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 27 పరుగుల తేడాతో విజయం సాధించడంతో నాలుగవ ప్లే ఆఫ్ బెర్త్ ఖాయమైంది. కానీ 2, 3 స్థానాల్లో నిలిచే జట్లపై ఇంకా క్లారిటీ రాలేదు. మే 19న (ఆదివారం) గువహాటి వేదికగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌ ఫలితం ఆధారంగా ఈ స్థానాలు ఖరారు కావాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్‌లో టాస్ ఆలస్యమైంది. దీంతో ఒకవేళ ఈ మ్యాచ్ రద్దైతే ప్లే ఆఫ్స్ సమీకరణాలు ఏంటి? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి నిజంగానే మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుందో ఒక లుక్కేద్దాం...


రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్‌కతా మధ్య మ్యాచ్‌లో ఐపీఎల్ 2024లో లీగ్ దశ మ్యాచ్‌లన్నీ పూర్తవుతాయి. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా గెలిచినా గెలవకపోయినా ఇప్పటికే ఉన్న 19 పాయింట్లతో అగ్రస్థానంలో నిలుస్తుంది. పంజాబ్ కింగ్స్‌పై గెలవడంతో మొత్తం 17 పాయింట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు రెండవ స్థానంలో నిలిచింది. ఇక 16 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతం మూడవ స్థానంలో ఉంది. చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే కోల్‌కతా, రాజస్థాన్ జట్లకు చెరొక పాయింట్ వస్తుంది. దీంతో రాజస్థాన్ ఖాతాలోని పాయింట్లు కూడా 17కు పెరుగుతాయి. ఈ సమీకరణంలో మెరుగైన రన్ రేట్ కలిగిన సన్‌రైజన్స్ హైదరాబాద్ రెండో స్థానంలో నిలుస్తుంది. పంజాబ్‌పై గెలిచాక సన్‌రైజర్స్ నెట్ రన్ రేట్ +0.414 గా ఉండగా రాజస్థాన్ రాయల్స్ నెట్ రన్ రేట్ +0.273గా ఉన్నాయి. అప్పుడు క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో కోల్‌కతాతో హైదరాబాద్ తలపడుతుంది. మే 21న అహ్మదాబాద్‌ వేదికగా క్వాలిఫైయర్-1 మ్యాచ్ జరగనుంది.


ఇక నెట్ రన్ రేట్ తక్కువగా ఉన్న కారణంగా రాజస్థాన్ రాయల్స్ 3వ స్థానానికి పరిమితమై ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడాల్సి ఉంటుంది. మే 22న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఒకవేళ వర్షం నిలిచిపోయాక మ్యాచ్ సజావుగా సాగి కోల్‌కతాపై రాజస్థాన్ విజయం సాధిస్తే 18 పాయింట్లతో రెండవ స్థానంలో నిలుస్తుంది. ఈ సమీకరణంలో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడాల్సి వస్తుంది.

Updated Date - May 19 , 2024 | 08:56 PM